న్యూఢిల్లీ: ఎస్ఎస్సీ పరీక్ష నిర్వహణలో లోపాలపై విద్యార్థులు నిరసన తెలిపారు. (SSC Students Protest) సర్వర్ క్రాష్ వంటి సాంకేతిక సమస్యల వల్ల పలు కేంద్రాల్లో ఆన్లైన్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యిందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఎస్ఎస్సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 రిక్రూట్మెంట్ టెస్ట్ జూలై 24న ప్రారంభమై ఆగస్ట్ 1న ముగిసింది. అయితే దేశ వ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు, ఇబ్బందులు తలెత్తాయి. సర్వర్ క్రాష్ కావడం వల్ల ఆన్లైన్ ఎగ్జామ్ మధ్యలో రద్దైంది. కంపూటర్లు మోరాయించడం, మౌస్‌లు పనిచేయకపోవడం వంటి ఇబ్బందులను అభ్యర్థులు ఎద్దుర్కొన్నారు.
కాగా, కొందరు అభ్యర్థులను 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పరీక్షా కేంద్రాలకు పంపారు. అక్కడ కూడా సాంకేతిక సమస్యల వల్ల ఆన్లైన్ ఎగ్జామ్స్‌ను రద్దు చేశారు. కొన్ని సెంటర్స్ వద్ద ఆందోళన చేసిన వారిపైకి బౌన్సర్లను ఉసిగొల్పినట్లు అభ్యర్థులు విమర్శించారు. మూడు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకోగా 55,000 మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సమస్యల గురించి ఎస్ఎస్సీకి ఫిర్యాదు చేసినట్లు అభ్యర్థులు తెలిపారు.
మరోవైపు ఎస్ఎస్సీ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 రిక్రూట్మెంట్ టెస్ట్‌లో నిర్వహణ లోపాలపై చలో ఢిల్లీకి విద్యార్థులు పిలుపునిచ్చారు. జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపైకి పోలీసులు బలప్రయోగం చేశారని విద్యార్థులు ఆరోపించారు.
కాగా, బ్లాక్‌లిస్ట్ చేసిన కంపెనీకి ఎగ్జామ్ నిర్వహణ టెండర్‌ను ప్రభుత్వం ఇచ్చిందని విమర్శించారు. తమ భవిష్యత్తును నిర్ణయించే పరీక్షలను ఇలాంటి సంస్థకు ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. పరిపాలనా లోపాలు, సాంకేతిక వైఫల్యాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నిరసనను తీవ్రం చేస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.
Also Read:
Watch: స్కూల్ గేట్ వద్ద విద్యార్థిని కిడ్నాప్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రూ.70,000కుపైగా జీతాలు.. 11,18,19ను ఇంగ్లీష్‌లో రాయడంలో ప్రభుత్వ టీచర్లు విఫలం