రాయ్‌పూర్: ప్రభుత్వ స్కూల్ టీచర్లు నెలకు రూ.70,000కుపైగా జీతాలు తీసుకుంటున్నారు. అయితే 11,18,19ను ఇంగ్లీష్‌లో రాయడంలో విఫలమయ్యారు. అలాగే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పేర్లు కూడా ఆ స్కూల్ పిల్లలు చెప్పలేకపోయారు. స్కూల్ తనిఖీ కోసం వెళ్లిన విద్యాశాఖ అధికారులు ఇది చూసి కంగుతున్నారు. (Chhattisgarh government teachers) బీజేపీ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో ఈ సంఘటన జరిగింది. బలరాంపూర్ జిల్లా ఘోడాసోట్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను విద్యాశాఖ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా స్కూల్ హెడ్మార్టర్, ఇద్దరు ఉపాధ్యాయులను చాలా సాధారణ ప్రశ్నలు అడిగారు. క్లాస్‌రూమ్‌లోని బోర్డుపై 11,18,19 అంకెలను ఇంగ్లీష్‌లో రాయాలని కోరారు. అయితే వీటిని ఉచ్ఛరించడంతోపాటు ఆ అంకెల ఇంగ్లీష్ స్పెలింగ్‌ను ఆ టీచర్లు బోర్డుపై సరిగా రాయలేకపోయారు.
కాగా, దేశ ప్రధానమంత్రి, ఛత్తీస్‌గఢ్ సీఎం ఎవరు అని ఆ స్కూల్ విద్యార్థులను విద్యాశాఖ అధికారులు అడిగారు. అయితే సమాధానం తెలియని పిల్లలు మౌనం వహించారు. ఆ జిల్లా కలెక్టర్, ఎస్పీ పేర్లను ప్రభుత్వ స్కూల్ టీచర్లు కూడా చెప్పలేకపోయారు. ఇది చూసి విద్యాశాఖ అధికారులు షాక్ అయ్యారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో సుమారు లక్ష వరకు జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ స్కూల్ టీచర్లు 11,18,19 వంటి సాధారణ పదాలను ఇంగ్లీష్‌లో రాకలేకపోవడం, సాధారణ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోవడంపై నెటిజన్లు విస్తూపోయారు. ఆ ప్రభుత్వ పాఠశాలలో బోధన, విద్యాప్రమాణాలపై మండిపడ్డారు. ఆ జిల్లా విద్యాశాఖ అధికారి ఈ సంఘటనపై స్పందించారు. దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.
टेस्ट में फेल हुए मास्टर साहब!
छत्तीसगढ़ के सरकारी स्कूल में टीचर्स ‘Eleven’ और ‘Nineteen’ तक नहीं लिख पाए… अब सवाल ये है कि ये बच्चों को क्या पढ़ाएंगे? आप खुद ही देखिए सोशल मीडिया पर वायरल ये वीडियो और रखिए अपनी राय.#Chhattisgarh #ViralVideo #Education #ATReel #AajtakSocial pic.twitter.com/XimX5gxjR8
— AajTak (@aajtak) July 30, 2025
Also Read:
Residence Certificate For Dog | మరో కుక్కకు నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు.. బీహార్‌లో ఘటన
Poorest Man In Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో మరో పేద వ్యక్తి.. ఆదాయం సున్నా
Watch: విధుల్లో చేరిన తొలిరోజే, గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి.. ఎందుకంటే?