పాట్నా: ఇటీవల ఒక కుక్కకు అధికారులు నివాస ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. తాజాగా మరో కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు అందింది. (Residence Certificate For Dog) దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఆన్లైన్ అప్లికేషన్‌పై దర్యాప్తు చేపట్టారు. ఎన్డీయే పాలిత బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. నవాడా జిల్లా సిర్దాల బ్లాక్‌లోని 11వ వార్డులో నివసించే ‘డాగేష్ బాబు’కు నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు అందింది. తండ్రి పేరు ‘డాగేష్ పాపా’గా,తల్లి పేరు ‘డాగేష్ మామి’గా అందులో పేర్కొన్నారు. దరఖాస్తుదారుడి ఫొటో స్థానంలో కుక్క ఫొటోను అప్లోడ్ చేశారు.
కాగా, ప్రజా సేవల హక్కు పోర్టల్ (ఆర్టీపీఎస్) ద్వారా దరఖాస్తు చేసిన ఈ ఆన్లైన్ అప్లికేషన్ అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో సిర్దాల జోన్ అధికారి అభినవ్ రాజ్ స్పందించారు. ఈ పోర్టల్ దుర్వినియోగం, ఈ మోసం గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు పాట్నాలోని మసౌర్హి జోన్ కార్యాలయంలో ‘డాగ్ బాబు’ పేరుతో ఒక కుక్కకు నివాస ధృవీకరణ పత్రాన్ని అధికారులు ఇటీవల జారీ చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో స్పందించిన అధికారులు ఆ సర్టిఫికెట్‌ను రద్దు చేశారు. దరఖాస్తుదారుడు, కంప్యూటర్ ఆపరేటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ త్యాగరాజన్ వెల్లడించారు.
Also Read:
Poorest Man In Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో మరో పేద వ్యక్తి.. ఆదాయం సున్నా
Watch: విధుల్లో చేరిన తొలిరోజే, గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి.. ఎందుకంటే?