Student | ఆలస్యంగా నిద్ర లేచింది.. పరీక్ష కేంద్రానికి వెళ్తే నో ఎంట్రీ
Student | 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో విద్యార్థినిని అధికారులు పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు. విద్యార్థిని, తన తండ్రి ఎంత బ్రతిమిలాడినా నిబంధనల కారణంగా పరీక్షకు అనుమతించలేదు. దీంతో చేసేదేమి లేక విద్యార్థిని వెనుతిరిగిపోయింది.
Student | జగిత్యాల టౌన్, ఫిబ్రవరి 25 : జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్.కె.ఎన్.ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని అష్రా మెహీన్ 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారులు పరీక్షా కేంద్రంలోనికి అనుమతించలేదు. విద్యార్థిని, తన తండ్రి ఎంత బ్రతిమిలాడినా నిబంధనల కారణంగా పరీక్షకు అనుమతించలేదు. దీంతో చేసేదేమి లేక విద్యార్థిని వెనుతిరిగిపోయింది.
రంజాన్ ప్రారంభమైన రోజు వల్ల ఉపవాస దీక్షలో ఉన్న విద్యార్థిని.. రాత్రి 3 గంటలకు భోజనం చేసి కొంత సేపు నిద్రపోయి లేస్తాననుకుంది. అయితే విద్యార్థిని తీరా లేచేసరికి సమయం ఉదయం 8:40 గంటలు అయ్యింది. అష్రా మెహీన్ హుటాహుటిన తయారై తండ్రితో కలిసి జిల్లా కేంద్రంలోని ఇస్లాంపురా నుంచి పరీక్షా కేంద్రానికి బయలుదేరింది. కొంత దూరం రాగానే వాహనంలో పెట్రోల్ అయిపోవడంతో మరింత ఆలస్యమైంది. చివరకు విద్యార్థిని పరీక్షా కేంద్రానికి చేరుకోగానే 9:15 నిమిషాలు సమయం కావడంతో అధికారులు లోనికి అనుమతించలేదు.
విద్యార్థిని తండ్రి, విద్యార్థిని ఎంత బ్రతిమిలాడినా నిబంధనల ప్రకారం అధికారులు నిరాకరించడంతో నిరాశతో విద్యార్థిని వెనుతిరిగిపోయింది. విద్యార్థిని పరీక్ష రాయలేకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆవేదనకు గురయ్యారు.


Read Also :
Virosh | చదువులోనూ టాపర్స్… స్టార్ కపుల్ విజయ్ – రష్మిక ఎడ్యుకేషన్ డిటేల్స్ వైరల్
Virosh Star Kids | నటన వద్దు.. దర్శకత్వమే ముద్దు: మెగా ఫోన్ పడుతున్న స్టార్ కిడ్స్!
Ayasher Song | నాని ‘ఆయాషేర్’ దెబ్బకి పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్’ ఔరా గల్లంతు!
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
- Tags
- Exam Centre
- Jagtial
- late
- Student
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

