Ayodhya Ram Temple: అయోధ్య కేసులో స్టేటస్ రిపోర్టు ఇవ్వండి: సుప్రీంకోర్టు
Ayodhya Ram Temple: అయోధ్య రామాలయంలో విరాళాలను చోరీ చేసిన కేసులో ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వీలైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలని సిట్‌ను సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో ఏవైనా సూచనలను చేస్తే, వాటిని నిష్పక్షపాతంగా పరిశీలించాలని SITని సుప్రీంకోర్టు కోరింది.
న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో(ayodhya Ram Temple) విరాళాలను చోరీ చేసిన కేసులో ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వీలైనంత త్వరగా దర్యాప్తును పూర్తి చేయాలని సిట్‌ను సుప్రీం ఆదేశించింది. ఈ కేసులో ఏవైనా సూచనలను చేస్తే, వాటిని నిష్పక్షపాతంగా పరిశీలించాలని SITని సుప్రీంకోర్టు కోరింది. దర్యాప్తులో గుణాత్మక విశ్లేషణ కోసం మాత్రం చేసే సూచనలను సిట్ పరిగణలోకి తీసుకోవాలని కోర్టు చెప్పింది. రామాలయ విరాళాల చోరీ కేసులో దర్యాప్తునకు చెందిన స్టేటస్ నివేదిక ఇవ్వాలని సిట్‌ను సుప్రీం ఆదేశించింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ కేసులో విచారణ చేపట్టింది.
విరాళాల చోరీ కేసులో దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో పెట్టి ఇవ్వాలని సుప్రీం కోరింది. దర్యాప్తులో గుణాత్మక మెరుగుదల, పారదర్శకత కోసం వివిధ వాజ్యందారులు చేసే సూచనలను సిట్ పరిగణలోకి తీసుకోవాలని కోర్టు పేర్కొన్నది. అయితే సిట్ నివేదికను పరిశీలించిన తర్వాతే.. రామాలయ నిధుల మేనేజ్మెంట్ అంశంలో సరైన మార్గదర్శకాలు ఇవ్వడం జరుగుతుందని కోర్టు పేర్కొన్నది. అయోధ్య కేసులో ఐజీపీ కిరణ్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన సిట్‌ను జూలై 27వ తేదీన ఏర్పాటు చేశారు. దర్యాప్తు బృందంలో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను కూడా జతకలపాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

