Enquiry Services | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 26: హనుమకొండ బస్‌స్టేషన్‌కు విచ్చేసే ప్రయాణికుల సౌకర్యార్థం, బస్సుల రాకపోకలు, సమయాలు, వివిధ రకాల బస్సుల వివరాలు, ఇతర ప్రయాణ సంబంధిత సమాచారం తెలుసుకోవడానికి విచారణ కౌంటర్లలో ప్రత్యేకంగా సెల్‌ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచడం జరిగిందని వరంగల్-1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు.
ప్రయాణికులు, ట్రై-సిటీస్ పరిధిలోని ప్రజలు హనుమకొండ డిస్ట్రిక్ట్ బస్‌స్టేషన్ (డీబీఎస్) 99592 26056, సిటీ బస్‌స్టేషన్ (సీబీఎస్) 99592 26049 నంబర్లను సంప్రదించి అవసరమైన సమాచారాన్ని పొందవచ్చని పేర్కొన్నారు. ఈ రెండు ఫోన్ నంబర్లు 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయన్నారు.
ప్రయాణికులు బస్సుల సమయాలు, సర్వీసుల వివరాలు తదితర సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.