RTC Bus | అది నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారి. వాహనదారులు ఇబ్బందులుపడుతున్నా అధికారులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని తాజా ఘటన చెప్పకనే చెబుతోంది. ములుగు జిల్లాలో రహదారులు అధ్వాన్నంగా మారాయి.
ఆర్టీసీ బస్సు గుంతల్లో దిగబడ్డది. ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు మంగపేట మండలం కమలాపురం–ఏటూరునాగారం ప్రధాన రహదారి మీదుగా వెళ్తుండగా.. రోడ్డపై ఉన్న గుంతల్లో దిగబడి ముందుకు కదలకుండా నిలిచిపోయింది. దీంతో రెండువైపులా వచ్చిపోయే వాహనాలు రహదారిపై భారీగా నిలిచిపోయాయి.
ఇసుక లారీలతోపాటు ఇతర వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోవడంతో రహదారిపై రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక రవాణా వల్ల రహదారులు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని, వెంటనే రహదారులు మరమ్మతులు చేయాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ములుగు జిల్లాలో అధ్వాన్నంగా రహదారులు.. గుంతల్లో దిగబడిన ఆర్టీసీ బస్సు
మంగపేట మండలం కమలాపురం–ఏటూరునాగారం ప్రధాన రహదారిపై ఉన్న గుంతల్లో దిగబడిన ఎలక్ట్రిక్ బస్సు
దీంతో రహదారిపై భారీగా నిలిచిపోయిన ఇసుక లారీలు, ఇబ్బంది పడిన వాహనదారులు
ఇసుక రవాణా వల్ల రహదారులు పూర్తిగా ధ్వంసం… pic.twitter.com/QhJ4uVRqQ0
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2026