AP News | పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కాంగ్రెస్-టీడీపీ బాహాబాహీ..!
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని బచ్చులవారిపాలెంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణ చివరకు హింసాత్మకంగా మారింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలోని బచ్చులవారిపాలెంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య చెలరేగిన ఘర్షణ చివరకు హింసాత్మకంగా మారింది. పరిస్థితి అదుపు తప్పడంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.
కొత్తరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఓటర్ల స్లిప్పులతో ఇతరులు దొంగ ఓట్లు వేశారని కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేస్తూ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో చీరాల మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత ఆమంచి కృష్ణమోహన్ పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకోవడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
ఈ క్రమంలో టీడీపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువర్గాలు పోలింగ్ బూత్ ఎదుటే కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులకు దిగాయి. ఈ దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసేందుకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు.
దాంతో ఘర్షణ మరింత తీవ్రరూపం దాల్చకుండా నిలువరించేందుకు పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపి గుంపును చెదరగొట్టారు. అనంతరం పరిస్థితిని అదుపులోకి తెచ్చిన అధికారులు, గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | పంచాయతీ ఎన్నికల పోలింగ్.. కాంగ్రెస్-టీడీపీ బాహాబాహీ..!
Brain Fog | రాత్రి సరిగ్గా నిద్రించినా ఉదయం తల భారంగా ఉంటుందా.. అందుకు కారణాలు ఇవే..
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

