Yogi Adityanath | ప్రధాని మోదీని కలిసిన యోగి ఆదిత్యనాథ్.. యూపీ 2027 ఎన్నికలపై చర్చ
Yogi Adityanath : ఉత్తర ప్రదేశ్‌లో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలపై చర్చించేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు.
Yogi Adityanath : ఉత్తర ప్రదేశ్‌లో 2027లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అందుకే ఈ ఎన్నికలపై చర్చించేందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్‌లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అలాగే, కేంద్ర మంత్రి జేపీ నద్దాతోనూ యోగి చర్చలు జరిపారు. శనివారం వరుసగా ప్రధాని సహా బీజేపీ అగ్రనేతల్ని యోగి కలుస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఎలా సిద్దమవ్వాలి అనే అంశంపై ప్రధానంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో బిడా ఝాన్సీ ప్రారంభోత్సవానికి మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అలాగే, ఇంకా కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్తాపనలు కూడా చేయబోతున్నారు. యూపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని, మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం అవసరమైతే రాష్ట్రానికి చెందిన మాజీ ఎంపీలను, గతంలో బీజేపీ అధ్యక్షులుగా పని చేసిన వారిని, మంత్రులను కూడా పోటీ చేయించాలని బీజేపీ భావిస్తోంది.
विश्व के सर्वाधिक लोकप्रिय राजनेता आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी से आज नई दिल्ली में शिष्टाचार भेंट की।
आपका मार्गदर्शन ‘नए उत्तर प्रदेश’ के निर्माण हेतु मुझे सदैव नई ऊर्जा देता है।
अमूल्य समय प्रदान करने के लिए हार्दिक आभार प्रधानमंत्री जी। pic.twitter.com/BLgxcQmjiq
— Yogi Adityanath (@myogiadityanath) September 26, 2026
బీజేపీలో కీలకంగా ఉన్న నేతలు ఈసారి ఎక్కువ మందిని పోటీలోకి దించాలని నిర్ణయించింది. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 255 సీట్లు గెలుచుకుంది. ఎన్డీయే కూటమిగా కలిసి దాదాపు 300 సీట్ల వరకు దక్కించుకుంది. వచ్చే నెలలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలు కూడా బీజేపీకి కీలకం. ఎలాగూ, బీజేపీ గెలిచే స్తానాలన్నీ గెలిచేవే. అందుకే కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, స్మృతి ఇరాని వంటివారిని పోటీ చేయించే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. ఎన్నికలకు ఇంకా ఆరు నెలలకుపైగా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటినుంచే బీజేపీ సిద్ధమవుతోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

