Friendly Match : చరిత్రాత్మక ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత ఫుట్‌బాల్ జట్టు గొప్పగా ఆడింది. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో నిండిన పనామా (Panama)ను సమర్ధంగా నిలువరించింది. బెంగళూరులో స్థానిక కంఠీరవం స్టేడియంలో అభిమానుల సందడి నడుమ మ్యాచ్‌ను డ్రాగా ముగించింది టీమిండియా. రియాన్ విలియమ్స్(Ryan Williams) ఏకైక గోల్ చేయగా.. ఆపై మెన్ ఇన్ బ్లూ పట్టుదలతో ఆడింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పనామా ఫార్వర్డ్స్‌ను అడ్డుకొని, వారి గోల్ ప్రయత్నాలను తిప్పికొట్టి 1-1తో డ్రా చేసుకుంది.
బెంగళూరులో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో భారత జట్టు ఓడినా ఆకట్టుకుంది. ఈమధ్యే ఫిఫా వరల్డ్‌కప్ ఆడిన 44వ ర్యాంకర్ పనామాతో తలపడిన టీమిండియా(138వ ర్యాంక్) బలమైన డిఫెన్స్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. కంఠీరవం స్టేడియంలో ఆద్యంతం నువ్వానేనా అన్నట్టు సాగిన మ్యాచ్‌లో రియాన్ విలియమ్స్ భారత్‌కు తొలి గోల్ అందించాడు. ఆరంభంలో బంతి పనామా ఆధీనంలోనే ఉండడంతో టీమిండియా గోల్ ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు 41వ నిమిషంలో ప్రత్యర్థి గోల్ కీపర్‌ను బోల్తా కొట్టించిన రియాన్ బంతిని గోల్ పోస్ట్‌లోకి పంపగా ఆధిక్యంలోకి వెళ్లింది మెన్ ఇన్ బ్లూ.
A clinical finish into the back of the net to give the Blue Tigers the breakthrough against Panama! 🦁
Watch India vs Panama, LIVE NOW on Sony Sports Network Channels, Sony LIV & Sony Aath!#SonySportsNetwork #SonyLIV #SonyAath #INDvPAN pic.twitter.com/Q62d56Swjk
— Sony Sports Network (@SonySportsNetwk) September 25, 2026
కానీ, బెంచ్‌పై నుంచి మైదానంలోకి వచ్చీ రాగానే జేవియర్ వాలెన్సియా గోల్ కొట్టాడు. దూరం నుంచి అతడు కిక్ చేసిన బంతి బాక్స్ అవతలకు పడేలా అనిపించినా.. చివరకు నెట్లోకి దూసుకెళ్లింది. దాంతో, ఇరుజట్ల స్కోర్లు సమం అయ్యాయి. డిఫెన్స్, ఆటాకింగ్ పరంగా అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా 1-1తో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. తదుపరి ఫ్రెండ్లీ మ్యాచుల్లో గుర్ప్రీత్ సారథ్యంలోని భారత్ అక్టోబర్ 3న బ్రెజిల్‌ను ఢీకొట్టనుంది.