నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన నార్నూర్,గాది గూడ మండలంలో నాగ పంచమి( Naga Panchami ) వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. చిన్న, పెద్ద తేడా లేకుండా కుటుంబ సమేతంగా పాము పుట్టల వద్దకు వెళ్లి నాగ దేవతకు సాంప్రదాయ పూజలు చేశారు. పుట్టల్లో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. నవ ధాన్యాల పేలాలు నైవేద్యంగా సమర్పించారు.
ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నాగదేవతను వేడుకున్నట్లు భక్తులు తెలిపారు. నార్నూర్ మండలంలోని చోర్గావ్ లోని రాములు మూర్తి ఆలయంలో నాగ చవితి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రూపావతి జ్ఞానోబా పుష్కర్, చోర్ గావ్ సర్పంచ్ కుమ్ర ధర్మ పాల్గొన్నారు.