అమరావతి : 2025 డీఎస్సీ( DSC ) లో జరిగిన అక్రమాలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) వెంటనే రాజీనామా చేయాలని వైసీపీ ఎమ్మెల్సీలు( Resign Demand ) డిమాండ్ చేశారు. పోస్టులను లక్షల రూపాయలకు అమ్ముకున్నారని ఆరోపించారు. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ ( AP Assembly ) , శాసనమండలి సమావేశాలు ( Legislative Council ) ప్రారంభమయ్యాయి.
సమావేశం ప్రారంభం కాగానే వైసీపీ ఎమ్మెల్సీ నాయకుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ డీఎస్సీ అక్రమాలను ప్రభుత్వాన్ని నిలదీశారు. అక్రమాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులు పరీక్షలు రాయకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా అక్రమాలు జరిగాయని , డీఎస్సీ అక్రమాలపై సీబీఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం చేయాలని, అయితే ప్రభుత్వం పోస్టులను అమ్ముకుని మూడు లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులను మోసం చేసిందని దుయ్యబట్టారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో మండలి సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు.