దక్షిణాదిలో ప్రతిభావంతురాలైన నాయికగా గుర్తింపును సంపాదించుకుంది కల్యాణి ప్రియదర్శన్. ముఖ్యంగా గత ఏడాది విడుదలైన ‘లోక ఛాప్టర్-1’ చిత్రం ఆమె కెరీర్‌ను మలుపుతిప్పింది. ఈ నేపథ్యంలో ఆమె ‘ప్రళయ్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నది. రణ్‌వీర్‌సింగ్ కథానాయకుడిగా జై మెహతా దర్శకత్వంలో జాంబీ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. బాలీవుడ్లో అరంగేట్రం చేస్తూనే రణ్‌వీర్‌సింగ్ సరసన నటించే లక్కీఛాన్స్‌ను దక్కించుకోవడంతో ఈ సొగసరి ఆనందానికి అవధులులేకుండా పోయాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ఆమె లుక్, ఫిట్నెస్, యాక్షన్ స్కిల్స్‌పై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నది. అందులో భాగంగా ముంబయికి మకాం మార్చి సినిమా పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలని నిర్ణయించుకుందట. ముఖ్యంగా యాక్షన్ ఘట్టాల కోసం గత మూడు నెలలుగా స్పెషల్ ట్రెయినింగ్ తీసుకుంటున్నదట. రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి వర్క్‌షాప్స్, రిహార్సల్స్‌లో పాల్గొంటూ బిజీగా గడుపుతున్నదీ భామ. ఈ సినిమా ద్వారా బాలీవుడ్లో బ్రేక్ సాధించి ఉత్తరాదిన కూడా తన ఇమేజ్ను పెంచుకోవాలనే లక్ష్యంతో కల్యాణి ప్రియదర్శన్ ఉందని చెబుతున్నారు. ‘ప్రళయ్’ చిత్రం అక్టోబర్‌లో సెట్స్‌మీదకు వెళ్లనుంది.