ఇటీవల విడుదలైన ‘ది ప్యారడైజ్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను దక్కించుకున్నారు హీరో నాని. ఈ విజయోత్సాహంలో ఆయన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. సుజిత్ దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ డ్రామా ‘బ్లడీ రోమియో’లో నాని నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్డేట్స్ బయటికొచ్చాయి. అక్టోబర్‌లో ఢిల్లీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుందని, మేజర్ పోర్షన్‌ను లండన్‌లో చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఈ సినిమా కథానాయిక రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి.
మీనాక్షి చౌదరిని హీరోయిన్గా ఖరారు చేసే అవకాశం ఉందని టాక్. మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ‘బ్లడీరోమియో’ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్ నెలకొని ఉంది. నిహారిక ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.