Priyadarshi | కేసీఆర్‌గారి పాత్రలో జీవించావు.. నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీశ్ రావు
ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి ఈరోజు ఉదయం మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రియదర్శి ఆయన సినీ ప్రయాణం, భవిష్యత్ ప్రాజెక్టులపై కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడారు.
ప్రముఖ సినీ నటుడు ప్రియదర్శి ఈరోజు ఉదయం మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రియదర్శి ఆయన సినీ ప్రయాణం, భవిష్యత్ ప్రాజెక్టులపై కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడారు. ఆత్మగౌరవం, అస్తిత్వం కోసం జరిగే పోరాటాలు ఒక జాతి విముక్తికి ఎలా స్ఫూర్తినిస్తాయో మనం తెలంగాణ సాధనలో చూశామని ఈ సందర్భంగా హరీశ్ రావు గారు గుర్తుచేశారు. ఒక జాతి గుర్తింపు కోసం జరిగిన పోరాటాన్ని ఇటీవల వచ్చిన ‘ప్యారడైజ్’ సినిమాలో అద్భుతంగా ఆవిష్కరించారని, ఆ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాత్రలో ప్రియదర్శి జీవించారని ఆయన కొనియాడారు. కేసీఆర్ గారి హావభావాలు, నడక, మాట తీరును పట్టుకోవడం చాలా కష్టమని.. కానీ, ఆ పాత్రలో ప్రియదర్శి పరకాయ ప్రవేశం చేసి అత్యంత సహజంగా నటించారని ప్రశంసించారు. ఆ పాత్ర ద్వారా ప్రియదర్శి ప్రజలకు చాలా బలంగా కనెక్ట్ అయ్యారని అభినందించారు.
‘ప్యారడైజ్’ సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ యాసకు, మన పల్లె కథలకు ప్రియదర్శి కేరాఫ్ అడ్రస్‌గా మారారని హరీశ్ రావు గారు అన్నారు. గతంలో వచ్చిన ’మల్లేశం’ సినిమా ద్వారా తెలంగాణ చేనేత కార్మికుల కష్టాలను, ’బలగం’ సినిమాతో మన పల్లె సంస్కృతిని, కుటుంబ బంధాలను ప్రపంచానికి అద్భుతంగా చాటిచెప్పారని గుర్తుచేశారు. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చి.. తన స్వయంకృషితో మట్టి కథలను మోసే అద్భుతమైన నటుడిగా ప్రియదర్శి ఎదగడం తెలంగాణకే గర్వకారణం అన్నారు. తెలంగాణ సినిమా, సంస్కృతిని మరింత ముందుకు తీసుకెళ్లేలా ఆయన భవిష్యత్తులో మరెన్నో గొప్ప ప్రాజెక్టులు చేయాలని హరీశ్ రావు గారు ఆకాంక్షించారు. మాజీ మంత్రి హరీశ్ రావు గారికి నటుడు ప్రియదర్శి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ, ప్రజల కోసం పాటు పడే నాయకుడిగా పేరు సంపాదించడం వెనుక ఎంతో కృషి దాగి ఉందని హరీశ్ రావు గారి పట్ల తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nivetha Pethuraj | ‘ఆదర్శ కుటుంబం’ కథ మొత్తం తెలియదన్న నివేదా పేతురాజ్.. ట్రోలింగ్ ఎదుర్కొంటున్న బ్యూటీ
Donald Trump | ఏఐ పదాన్ని నిషేధిస్తా : ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
విద్యుత్తు కొనుగోళ్లకు ఆత్రమెందుకు.. ఈఆర్సీకి సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్‌రావు అభ్యంతరాలు
Healthy Foods | చేపలు తినని వారికి గుడ్‌న్యూస్.. ఒమేగా 3 అందించే ఆహారాలు ఇవే!
Saudi Arabia | దాడులు ఆపితే 9500 కోట్లు ఇస్తాం.. హౌతీలకు సౌదీ బంపర్ ఆఫర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

