జల దోపిడీ నిజమే
‘నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి 1.8 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది.
- కేఆర్ఎంబీకి అభ్యంతరాలు చెప్పినం
- తెలంగాణ నీటి హక్కులపై రాజీపడం
- ఏపీ ప్రయత్నాలను అడ్డుకుంటాం: ఉత్తమ్
హుజూర్నగర్, నవంబర్ 19: ‘నాగార్జున సాగర్ రిజర్వాయర్ నుంచి 1.8 టీఎంసీల నీటిని తరలించేందుకు ఏపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలను తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఏపీ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వానికి, కేఆర్ఎంబీకి అభ్యంతరాలు తెలిపాం’ అని రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కృష్ణా, గోదావరి నదీజలాల్లో తెలంగాణ నీటి హక్కులపై రాజీపడబోమని తెలిపారు.
తెలంగాణకు రావాల్సిన నీటివాటాను దెబ్బతీసే ఏకపక్ష చర్యలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గురువారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దీనికోసం అవసరమైన ప్రతి సంస్థాగత, న్యాయవేదికల పైనా పోరాడుతామని ప్రకటించారు. రాష్ట్రనీటి హక్కుల పరక్షణ రైతుల సాగునీరు, ప్రజల తాగునీరు, లక్షలాది కుటుంబాల జీవనోపాధితో ముడిపడి ఉన్నదని పేర్కొన్నారు. వాతావరణ పరిస్థితులు, రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని తాగునీటి అవసరాల కోసం నీటి సంరక్షణపై కూడా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకొంటుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

