దమ్మపేట, ఆగస్టు 17 : కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేయ జూస్తుందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి నిరసన వ్యక్తం చేసి డిమాండ్లతో కూడిన పత్రాన్ని దమ్మపేట డిప్యూటీ తాసీల్దార్ రామకృష్ణకి అందజేశారు. ఈ సందర్భంగా మెచ్చా మాట్లాడుతూ.. దోచుకోవడం దాచుకోవడమే పనిగా ముఖ్యమంత్రి నుండి ఎమ్మెల్యే వరకు పెట్టుకున్నారన్నారు. ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేసినట్లు తెలిపారు. కోట్లాది సాధించుకున్న రాష్ట్రంలో ఏ నిరుపేద ఆడబిడ్డ ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో ఒక మేనమామలా కేసీఆర్ కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతోమందికి ఆర్థికంగా సహాయపడ్డారన్నారు. కాంగ్రెస్ నాయకులు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇప్పుడు ఈ పథకాన్ని నిలిపివేయడానికి కుట్రలు చేస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో మండల మాజీ అధ్యక్షుడు దొడ్డ రమేష్, మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, మండల మాజీ ఉపాధ్యక్షుడు గాజుబోయిన యేసు బాబు, నాయకపోడు సంఘం రాష్ట్ర నాయకుడు రావుల శ్రీనివాసరావు, మండల నాయకుడు తుమ్మల లక్ష్మణరావు, నియోజకవర్గ యూత్ మాజీ కార్యదర్శి యార్లగడ్డ శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీలు దేవరలపల్లి అజయ్ కుమార్, జలగం వాసు, చీకటి రామయ్య, గుత్తి శ్రీను, అబ్దుల్ జిన్నా, సర్పంచులు యాట్ల రాందాస్, కొమరం సుశీల, ఉప సర్పంచ్ రామకృష్ణ, వార్డు మెంబర్లు దారా రాము, రూప రాంబాబు, ఉయ్యాల లక్ష్మీనారాయణ, తోలేం మల్లేశ్వరావు, సున్నం కృష్ణ, వేలుగోటి మహేష్, కాసిని శ్రీను, మద్దెల పుల్లారావు, అడపా వెంకట నరసయ్య నాయుడు, పాశం ప్రసాద్, వల్లేపు నాగేశ్వరరావు, గుడిపూడి రవి, గొర్రెపాటి వెంకటేశ్వరరావు, కౌలురి నాగయ్య, గుమ్మడపు విష్ణు, కోర్స వెంకటేష్, వాసం పండు, కౌలురి ఏసు, కందుకూరి రాంబాబు, గణేష్, అశోక్, పాశ్యం శరణ్, మచ్చల ముత్యాలు, నాటి సుధాకర్ పాల్గొన్నారు.