Fake Police Arrest | స్మోక్ చేసిన వ్యక్తికి జరిమానా విధించి.. రైలు నుంచి తోసేసిన నకిలీ పోలీస్
Fake Police Arrest | దివ్యాంగుడైన యవకుడు రైలులో ప్రయాణిస్తూ స్మోక్ చేశాడు. నకిలీ పోలీస్ అవతారమెత్తిన వ్యక్తి ఆ యువకుడికి రూ.20,000 జరిమానా విధించాడు. ఆ డబ్బు చెల్లించనందుకు కదులుతున్న రైలు నుంచి అతడు తోసేయడంతో ఆ యువకుడు మరణించాడు.
పాట్నా: దివ్యాంగుడైన యవకుడు రైలులో ప్రయాణిస్తూ స్మోక్ చేశాడు. నకిలీ పోలీస్ అవతారమెత్తిన వ్యక్తి ఆ యువకుడికి రూ.20,000 జరిమానా విధించాడు. ఆ డబ్బు చెల్లించనందుకు కదులుతున్న రైలు నుంచి అతడు తోసేయడంతో ఆ యువకుడు మరణించాడు. దర్యాప్తు చేసిన రైల్వే పోలీసులు ఆ నిందితుడిని అరెస్ట్ చేశారు. (Fake Police Arrest) బీహార్‌లో ఈ సంఘటన జరిగింది. వైశాలి జిల్లాకు చెందిన 21 ఏళ్ల నితిన్ కుమార్, హైదరాబాద్‌లో కూలీగా పనిచేసేవాడు. సెప్టెంబర్ 19న హైదరాబాద్-దానాపూర్ స్పెషల్ ట్రైన్లో బీహార్‌లోని తన ఊరికి బయలుదేరాడు. దివ్యాంగుడైన నితిన్ కుమార్, రైలులోని వికలాంగుల కోచ్‌లో ప్రయాణించాడు. సెప్టెంబర్ 20న రాత్రి వేళ రైలులో అతడు స్మోక్ చేశాడు.
కాగా, దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కి, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), టికెట్ చెకింగ్ టాస్క్ ఫోర్స్ అధికారిగా నటించి రైలు ప్రయాణికులను టార్గెట్ చేసే మోసగాడైన వ్యక్తి, నితిన్ సిగరెట్ కాల్చడాన్ని గమనించాడు. తాను రైల్వే పోలీస్ అధికారినని బెదిరించి రూ.20,000 జరిమానా విధించాడు. బక్సర్ స్టేషన్లో అతడ్ని బలవంతంగా రైలు నుంచి దించాడు. ఆ రాత్రి వేళ నితిన్ మొబైల్ నుంచి అతడి కుటుంబానికి ఫోన్ చేయించి పది వేలు డిమాండ్ చేశాడు. మరునాడు డబ్బు పంపుతామన్న నితిన్ కుటుంబ సభ్యులు, ఆ మేరకు రూ.5,000 తమ కుమారుడికి ఫోన్ ద్వారా పంపారు.
మరోవైపు సెప్టెంబర్ 21 ఉదయం నితిన్ మొబైల్ నుంచి వారి కుటుంబ సభ్యులకు మరో ఫోన్ కాల్ వచ్చింది. ఆ వ్యక్తి ఈసారి రూ.20,000 డిమాండ్ చేశాడు. ఆ డబ్బు కోసం రోజంతా నితిన్ కుటుంబ సభ్యులకు అతడి ఫోన్ నుంచి పలు కాల్స్ చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ వారు నితిన్‌తో మాట్లాడలేకపోయారు. దీంతో అనుమానించిన నితిన్ కుటుంబ సభ్యులు గ్రామ పెద్దతో కలిసి బక్సర్ రైల్వే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.
కాగా, దానాపూర్ రైల్వే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) కాంచన్ రాజ్ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైంది. సాంకేతిక, ఇతర ఆధారాలు, సమాచారం ద్వారా నిందితులను గుర్తించారు. మోహన్‌సరాయ్ ప్రాంతంతో రోహిత్ తివారీని అరెస్ట్ చేశారు. డిమాండ్ చేసిన డబ్బు అందకపోవడంతో కదులుతున్న రైలు నుంచి నితిన్‌ను తోసేసినట్లు అతడు చెప్పాడు.
అయితే నిందితుడి సమాచారం ఆధారంగా ఆరా- జగ్జీవన్ హాల్ట్ మధ్య రైల్వే పట్టాల వద్ద ఒక మృతదేహాన్ని రైల్వే పోలీసులు కనుగొన్నారు. నితిన్ మృతదేహంగా అతడి తండ్రి గుర్తించినట్లు రైల్వే పోలీస్ అధికారి తెలిపారు. అరెస్టైన నిందితుడు రోహిత్ తివారీపై గతంలో పలు కేసులు నమోదయ్యాయని చెప్పారు. 25 నెలల పాటు జైలులో ఉన్న అతడు రెండు నెలల కిందట బెయిల్‌పై విడుదలై పలు నేరాలకు పాల్పడినట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

