Residence Certificate for Dog | బీహార్‌లో కుక్కకు నివాస ధృవీకరణ పత్రం.. బీజేపీకి అది ఓటు వేస్తుందని విపక్షాల విమర్శ
Residence Certificate for Dog | త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్‌లో ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణపై వివాదం నెలకొన్నది. రాష్ట్ర గుర్తింపు రిజిస్ట్రీ (ఎస్ఐఆర్)లో పౌరుల రికార్డుల అప్డేట్ కసరత్తు జరుగుతున్నది. ఈ తరుణంలో ఒక కుక్కకు నివాస ధృవీకరణ పత్రం జారీ అయ్యింది.
పాట్నా: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్‌లో ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణపై వివాదం నెలకొన్నది. రాష్ట్ర గుర్తింపు రిజిస్ట్రీ (ఎస్ఐఆర్)లో పౌరుల రికార్డుల అప్డేట్ కసరత్తు జరుగుతున్నది. ఈ తరుణంలో ఒక కుక్కకు నివాస ధృవీకరణ పత్రం జారీ అయ్యింది. (Residence Certificate for Dog) దీంతో ఆ కుక్క బీజేపీకి ఓటు వేస్తుందని విపక్షాలు విమర్శించాయి. రాజధాని పాట్నా సమీపంలోని మసౌర్హి పట్టణంలోని ప్రజా సేవల హక్కు (ఆర్టీపీఎస్) పోర్టల్‌లో ‘డాగ్ బాబు’ పేరుతో రెసిడెంట్ సర్టిఫికెట్‌ను అధికారులు జారీ చేశారు. ఇందులో తండ్రి పేరు ‘కుట్ట బాబు’ అని, తల్లి పేరు ‘కుట్టియా దేవి’ అని ఉన్నది. కౌలిచాక్, వార్డ్ నంబర్ 15, నగర్ పరిషత్ మసౌర్హిని చిరునామాగా పేర్కొన్నారు. దరఖాస్తుదారుడి ఫొటో స్థానంలో కుక్క బొమ్మ ఉన్నది. రెవెన్యూ అధికారి మురారి చౌహాన్ డిజిటల్ సంతకంతో జూలై 24న ఈ నివాస ధృవీకరణ పత్రం జారీ అయ్యింది.

Residence Certificate For Dog
కాగా, ‘కుక్క బాబు’కు జారీ చేసిన ఈ రెసిడెంట్ సర్టిఫికెట్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో బీహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ఆ కుక్క ప్రత్యక్షమై బీజేపీకి ఓటు వేస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ‘బహుశా వారు ‘డాగ్ బాబు’ను అభ్యర్థిగా కూడా చేస్తారేమో. బీజేపీ కార్యకర్తలందరూ ఆయనకు ఓటు వేస్తారు. ఇది ఎన్నికల వ్యవస్థను బీజేపీ నగ్నంగా తారుమారు చేయడం, @ECISVEEP ద్వారా క్రిమినల్ సిండికేట్‌గా పనిచేస్తున్న నేరస్థుల పని ఇది. కోర్టులు పక్కదారి పట్టాయి. ప్రజాస్వామ్య మారణహోమాన్ని నిశ్శబ్దంతో ఆశీర్వదిస్తున్నాయి’ మండిపడింది.
ఆధార్, రేషన్ కార్డులు నకిలీవి అని పిలుస్తున్నప్పుడు, ఓట్ల సవరణ కోసం పరిగణించే సర్టిఫికేట్ ఇదేనని స్వరాజ్ ఇండియా సభ్యుడు యోగేంద్ర యాదవ్ ఎద్దేవా చేశారు.
మరోవైపు అధికారులు దీనిపై స్పందించారు. ఈ విషయం తమ దృష్టికి వచ్చిన వెంటనే ఆ సర్టిఫికెట్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. దరఖాస్తుదారుడు, కంప్యూటర్ ఆపరేటర్, సర్టిఫికేట్ జారీ చేసిన అధికారిపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈ సంఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరుపుతామని, దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
Also Read:
Farmer Annual Income Rs.3 | దేశంలోనే పేద రైతు.. వార్షిక ఆదాయం రూ.3గా ఇన్కమ్ సర్టిఫికెట్ జారీ
Patients Die | సాంకేతిక లోపంతో తగ్గిన ఆక్సిజన్ సరఫరా.. ముగ్గురు రోగులు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

