భోపాల్: ఒక రైతు వార్షిక ఆదాయం కేవలం రూ.3. (Farmer Annual Income Rs.3) ఈ మేరకు ఇన్కమ్ సర్టిఫికెట్లో పేర్కొన్నారు. అధికారులు జారీ చేసిన ఈ ఆదాయ ధృవీకరణ పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో అతడ్ని దేశంలోనే పేద రైతుగా నెటిజన్లు అభివర్ణించారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. సత్నా జిల్లా కోఠి తహసీల్ పరిధిలోని నయాగావ్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల రాంస్వరూప్ రైతు. ఆదాయ ధృవీకరణ పత్రం కోసం అతడు దరఖాస్తు చేశాడు. జూలై 22న తహసీల్దార్ సౌరభ్ ద్వివేది సంతకంతో ఇన్కమ్ సర్జిఫికెట్ జారీ అయ్యింది. రైతు రామ్‌స్వరూప్ వార్షిక ఆదాయాన్ని రూ.3గా ఇందులో పేర్కొన్నారు. ఈ సర్టిఫికెట్ ప్రకారం రాంస్వరూప్ నెలకు 25 పైసలు సంపాదిస్తున్నట్లు తెలుస్తున్నది.
కాగా, ఈ ఆదాయ ధృవీకరణ పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ‘మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ పాలనలో, భారతదేశంలో అత్యంత పేద వ్యక్తిని మేం కనుగొన్నాం. వార్షిక ఆదాయం కేవలం రూ.3, ఇది షాకింగ్ కాదా? ప్రజలను పేదలుగా మార్చే లక్ష్యం? ఎందుకంటే ఇప్పుడు కుర్చీ కూడా కమీషన్ తింటున్నది’ అని ఆరోపించింది.
మరోవైపు ఈ ఇన్కమ్ సర్టిఫికెట్‌పై విమర్శలు రావడంతో సంబంధిత అధికారులు స్పందించారు. ‘క్లరికల్ ఎర్రర్’ వల్ల ఇలా జరిగిందని వివరణ ఇచ్చారు. కొత్త ఆదాయ ధృవీకరణ పత్రాన్ని జూలై 25న జారీ చేశారు. రాంస్వరూప్ వార్షిక ఆదాయం రూ.30,000గా అందులో పేర్కొన్నారు. అంటే ఆ రైతు నెల సంపాదన రూ.2,500కు పెరిగింది.
मोहन राज में ही मिला भारत का सबसे गरीब आदमी! सतना जिले में एक आय प्रमाण पत्र जारी हुआ! सालाना आमदनी केवल 03.00 रुपए बताई गई है!
है ना चौंकाने वाली बात!
जनता को गरीब बनाने का मिशन?
क्योंकि, अब कुर्सी ही खा रही कमीशन! pic.twitter.com/hB8Q8fDSns— MP Congress (@INCMP) July 26, 2025
Also Read:
Raj Thackeray Enters Matoshree | 13 ఏళ్ల తర్వాత.. తొలిసారి మాతోశ్రీలోకి అడుగుపెట్టిన రాజ్ ఠాక్రే
Rave Party Raid | రేవ్ పార్టీపై పోలీసులు రైడ్.. మాజీ మంత్రి అల్లుడుతో పాటు పలువురు అరెస్ట్