పెన్పహాడ్, మార్చి 13 : విద్యార్థులు పరీక్షలపై భయం వీడి, ప్రశాంతంగా రాయాలని రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చెర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం పెన్పహాడ్ మండల పరిధి దోసపహాడ్ లోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అందించిన పరీక్ష కిట్లు, ప్యాడ్స్, పెన్స్ పంపిణీ చేశారు. అనంతరం స్ప్రెడ్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ చెర్మన్ పటేల్ శ్రీధర్ రెడ్డి సహాయ సహకారంతో అందించిన ఫ్రీడ్జ్ ను పాఠశాలకు బహూకరించారు. ఈ సందర్భంగా రమేశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మంచి వాతావరణంలో విద్యను అభ్యసించేలా సౌకర్యాలు కల్పించడం సమాజం బాధ్యత అన్నారు. విద్యార్థినుల ఆరోగ్యం, సౌకర్యం విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్ప్రెడ్ ఇంటర్నేషనల్ సంస్థను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, పాఠశాల సిబ్బంది, వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

విద్యార్థులు పరీక్షలపై భయం వీడాలి : పటేల్ రమేశ్ రెడ్డి