నాగర్ కర్నూల్ : రాష్ట్ర గవర్నర్ ( Governor ) శివ ప్రతాప్ శుక్లాకు ( Shiv Pratap Shukla) నాగర్కర్నూల్ జిల్లా యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. గవర్నర్ కుటుంబ సమేతంగా కలిసి శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి( Srisailam), అమ్మవార్లను దర్శించు కునేందుకు హైదరాబాద్ నుంచి నేరుగా రోడ్డు మార్గాన శ్రీశైలం దర్శనానికి వెళ్తూ మార్గమధ్యంలో నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మున్ననూర్ గ్రామ పరిధిలో ఉన్న తెలంగాణ టూరిజం మృగవాణి గెస్ట్ హౌస్కు శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కాసేపు విరామం అనంతరం శ్రీశైలం దర్శనానికి బయలు దేరి వెళ్లారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.