Yash | కన్నడ స్టార్ హీరో యశ్ ప్రస్తుతం ‘టాక్సిక్’ సినిమాతో పాటు తన కెరీర్‌ను భారీ స్థాయిలో విస్తరించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న యశ్.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో అత్యంత క్రేజ్ ఉన్న హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ హిందీ టాక్ షోలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఓ హిందీ టాక్ షోలో పాల్గొన్న యశ్‌ను యాంకర్ ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ వంటి దక్షిణాది స్టార్ హీరోలకు తొలినాళ్లలోనే ‘పాన్ ఇండియా స్టార్’ అనే గుర్తింపు ఎందుకు రాలేదు? కానీ యశ్ మాత్రం ‘కేజీఎఫ్’ సినిమాలతో దేశవ్యాప్తంగా ఆ స్థాయి క్రేజ్ ఎలా సంపాదించుకున్నారు? అని ప్రశ్నించారు.
దీనికి యశ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒకే ఒక్క శుక్రవారం ఒక హీరో కెరీర్‌ను పూర్తిగా మార్చగలదని యశ్ వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీలో విజయమే అత్యంత కీలకమని యశ్ అభిప్రాయపడ్డారు. ఒక సినిమా భారీ విజయం సాధిస్తే ఒక్కసారిగా హీరోకు దేశవ్యాప్తంగా గుర్తింపు వస్తుందని, అదే సమయంలో ఆ ట్యాగ్ శాశ్వతం కాదని ఆయన పేర్కొన్నారు.ఒక సినిమా సరిగ్గా ఆడకపోతే ‘పాన్ ఇండియా స్టార్’ అనే ట్యాగ్ కూడా ఒక్కసారిగా కనుమరుగయ్యే అవకాశం ఉందనే భావనను యశ్ వ్యక్తం చేశారు. అంటే హీరోకు వచ్చే స్టార్డమ్ కంటే అతను నటించే సినిమాల ఫలితమే ఎక్కువ ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు.యశ్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ అభిమానుల్లో కొందరు యశ్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోల స్థాయిని ప్రస్తావిస్తూ యశ్ చేసిన వ్యాఖ్యలను కొందరు ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు.
మరోవైపు యశ్ అభిమానులు మాత్రం ఆయన చెప్పింది సాధారణంగా సినిమా విజయానికి సంబంధించిన విషయమేనని, ఎవరినీ తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం ఆయనకు లేదని సమర్థిస్తున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ అనేది ఒక్క సినిమాతో వచ్చినా, దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం వరుస విజయాలపై ఆధారపడి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. కన్నడలో స్టార్ హీరోగా ఉన్న యశ్‌కు ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ దేశవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత ‘కేజీఎఫ్: చాప్టర్ 2’ మరింత పెద్ద విజయాన్ని సాధించడంతో ఆయన క్రేజ్ హిందీ సహా అన్ని భాషల్లో విపరీతంగా పెరిగింది. దీంతో యశ్‌ను పాన్ ఇండియా స్టార్‌గా ప్రేక్షకులు గుర్తించడం ప్రారంభించారు.