‘మత్తు మాయలో పడొద్దు.. భవిష్యత్ నాశనం చేసుకోవద్దు’
మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలపై ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ కారేపల్లి సర్కిల్ ఆధ్వర్యంలో మంగళవారం కారేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
– ఎక్సైజ్ శాఖ ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి
కారేపల్లి, సెప్టెంబర్ 22 : మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై పడే దుష్ప్రభావాలపై ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ కారేపల్లి సర్కిల్ ఆధ్వర్యంలో మంగళవారం కారేపల్లి మండల కేంద్రంలో గల ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఖమ్మం జిల్లా డిప్యూటీ కమిషనర్ ఎం.సోమిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. మత్తు పదార్థాలకు అలవాటు పడడం వల్ల విద్యార్థుల చదువులు, ఆరోగ్యం, కుటుంబ జీవితం, భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.
విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని, తమ చుట్టూ ఉన్నవారిలోనూ మత్తు పదార్థాల విపరిణామాలపై అవగాహన కల్పించాలని సూచించారు. యువత మత్తు పదార్థాలకు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ పి.లింగయ్య, ఉపాధ్యాయలు ఎం.సుడోమన్ రాజ్, సిహెచ్ సరిత, పి.శ్యాంప్రసాద్, సిబ్బంది, విద్యార్థులు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

