Died | బాలీవుడ్ (Bollywood) హీరోయిన్ రాణీ ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ (75 ఏండ్లు) మంగళవారం మధ్యాహ్నం మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానుల ప్రేమ, ప్రార్థనలకు కుటుంబం కృతజ్ఞతలు వెల్లడించారు. తీవ్ర దుఃఖంలో తమ కుటుంబానికి ఏకాంతం కల్పించాలని వారు కోరారు.
తల్లితో తనకు ఉన్న అనుబంధాన్ని రాణీ ముఖర్జీ తరచుగా ప్రస్తావించేవారు. మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే (Mrs. Chatterjee vs Norway) సినిమాలో తన పిల్లలను పొందేందుకు పోరాడే బెంగాలీ తల్లి పాత్రను పోషించింది. 2023లో ఈ చిత్ర ప్రచార కార్యక్రమంలో ఆ పాత్రలో నటించడానికి తల్లి కృష్ణ ముఖర్జీ స్ఫూర్తే కారణమని అన్నారు.
కృష్ణ ముఖర్జీ ఒకప్పుడు నేపథ్య గాయనిగా పనిచేశారు. ఈమె ఫిల్మాలయా స్టూడియోస్ సహవ్యవస్థాపకుడైన నిర్మాత రామ్ ముఖర్జీని వివాహం చేసుకున్నారు. రామ్ 2017లో మరణించారు.