సోనియా మనసులో తెలంగాణ లేదు
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నరు.. నిజంగా వారికి అంత ప్రేమ ఉంటే పీవీ అంత్యక్రియలను ఢిల్లీలో ఎందుకు చేయలేదని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలె. తెలంగాణ నాయకత్వం, ప్రజలపై సోనియాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ నిజమైన అభిమానం లేదు.
- అందుకే తన ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన తేలేదు
- తెలంగాణ పట్ల ఆమెకు, కాంగ్రెస్‌కు ప్రేమ లేదనేది సుస్పష్టం
- ఎన్నికల ముందు అభయహస్తం.. తర్వాత రిక్తహస్తం
- మూడేండ్ల కాంగ్రెస్ పాలనలో సాధించింది శూన్యం
- రంగుల కల చూపించి అన్ని వర్గాలనూ మోసం చేశారు
- హామీలు నెరవేర్చకపోగా తెలంగాణను అవమానిస్తున్నరు
- గాంధీల దయకోసం బాడీగార్డుల్లా వ్యవహరిస్తున్నరు
- ఆత్మగౌరవం కోసం పోరాడిన గడ్డపై ఇలాంటి గులాములా?
- కాంగ్రెస్ పాలనలో రైజింగ్ కాదు.. తెలంగాణ ఫాలింగ్
- మూడేండ్లలో పెట్టుబడులెన్నో శ్వేతపత్రం ఇవ్వగలరా?
- భారత్ సమ్మిట్ వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమీ లేదు
- చిట్‌చాట్‌లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
పీవీ అంత్యక్రియలు ఢిల్లీలో ఎందుకు చేయలే?
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్నరు.. నిజంగా వారికి అంత ప్రేమ ఉంటే పీవీ అంత్యక్రియలను ఢిల్లీలో ఎందుకు చేయలేదని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలె. తెలంగాణ నాయకత్వం, ప్రజలపై సోనియాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ నిజమైన అభిమానం లేదు.
– కేటీఆర్
గాంధీలకు బాడీగార్డులా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణ సీఎం హోదాలో ఉండి గాంధీల కుటుంబానికి రేవంత్‌రెడ్డి అంగరక్షకుడిలా వ్యవహరిస్తున్నడు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వచ్చినప్పుడల్లా వారికి బాడీగార్డులా ఉంటున్నడు. తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత రేవంత్‌పై ఉన్నది. అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి
రాష్ట్ర గౌరవాన్ని దిగజార్చడం ఎంతవరకు సమంజసం?
– కేటీఆర్
దీక్షా దివస్ 29న కరీంనగర్లో భారీ సభ
కరీంనగర్ జిల్లా అలుగునూరులో 2009 నవంబర్ 29న కేసీఆర్ అరెస్టయిన ప్రాంతంలోనే ఈ నెల 29న దీక్షా దివస్ సభను ప్రత్యేకంగా నిర్వహిస్తం. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సభలు నిర్వహించడంతో పాటు కరీంనగర్ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యమిస్తం. ఉద్యమ సమయంలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, కళాకారులు, ఉద్యమకారులందరినీ గుర్తించి గౌరవిస్తం.
– కేటీఆర్

హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఇచ్చింది సోనియమ్మేనని చెప్పుకొనే కాంగ్రెస్ నాయకులు.. ఆమె ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు ఎన్నడూ నిజమైన ప్రేమ లేదని, ఇక్కడి ప్రజలు సృష్టించిన రాజకీయ అనివార్యతకు తలొగ్గే ఆ పార్టీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని స్పష్టంచేశారు. సోనియాగాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం రాష్ట్రం పట్ల ఆమెకు, కాంగ్రెస్‌కు ప్రేమ లేదని స్పష్టంగా వెల్లడైందని కేటీఆర్ చెప్పారు.
తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్సేనని, తెలంగాణ చరిత్రను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోవాలని చూడటం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియా ప్రతినిధులతో కేటీఆర్ ఇష్టాగోష్టి మాట్లాడారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ ఆత్మకథ మొదలు కాంగ్రెస్ పాలన, పెట్టుబడులు, ఉద్యోగాలు, సాగునీరు, తాగునీరు, కాంట్రాక్టులు, ప్రాజెక్టుల పేర్ల మార్పు, రైతుల సమస్యలు, రాజకీయ కక్షసాధింపు తదితర అంశాలపై కేటీఆర్ తన అభిప్రాయాలను వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని దుయ్యబట్టారు. గాంధీలను ప్రసన్నం చేసుకొనేందు కు తెలంగాణ నాయకులు బాడీగార్డుల్లా, గులాము ల్లా వ్యవహరించడం సిగ్గుచేటమని మండిపడ్డారు.
పీవీ అంత్యక్రియలు ఢిల్లీలో ఎందుకు నిర్వహించలేదు?
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుపై కాంగ్రెస్ నాయకులకు నిజంగా అంత ప్రేమ ఉంటే ఢిల్లీలో అంత్యక్రియలు ఎందుకు నిర్వహించలేదని ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ వాణీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పీవీపై ఇప్పుడు ప్రేమ ఒలకబోస్తున్న నేతలకు వాణీదేవి గట్టి సమాధానం చెప్పారని, తెలంగాణ నాయకత్వంపై, ప్రజలపై సోనియాగాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ నిజమైన అభిమానం లేదని విమర్శించారు.
నాడు ముద్దపప్పు.. నేడు ముద్దయ్యాడా?
గతంలో రాహుల్‌గాంధీని ముద్దపప్పు అని, సోనియాగాంధీని బలిదేవత అని విమర్శించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం వారిపై ప్రేమను ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. నాడు ముద్దపప్పు అయిన రాహుల్.. ఇవాళ ముద్దు అయ్యాడా? అని ప్రశ్నించారు. తాము మాత్రం ఎప్పుడూ ఒకే రా జకీయ వైఖరితో ఉన్నామని, ప్రతిపక్షంలో ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా మాట్లాడే అలవాటు తమకు లేదని చెప్పారు. తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని, 2001 ఏప్రిల్ 27న కరీంనగర్లో కేసీఆర్ ఈ విషయాన్ని స్పష్టంచేశారని గుర్తుచేశారు.
తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్
రాష్ట్రంలో అభివృద్ధి, ఉపాధి, పెట్టుబడుల రంగాలు ముందుకు సాగాల్సింది పోయి వెనకి వెళ్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. ‘మూడేండ్ల తెలంగాణ నాట్ రైసింగ్.. తెలంగాణ ఫాలింగ్’ అని వ్యాఖ్యానించారు. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తే ఐటీ ఉద్యోగాలు ఎందుకు తగ్గుతున్నాయని, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు కుదేలవుతున్నదని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో ఐటీ ఉద్యోగాలు ఏడు వేలకుపైగా తగ్గినట్టు పేరొన్న విషయాన్ని ప్రస్తావించారు. 2026-27 బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార కూడా ఐటీ ఉద్యోగాలు తగ్గినట్లు చెప్పారని గుర్తుచేశారు. పెట్టుబడులు పెరిగితేనే కొత్త కార్యాలయాలు, నివాస గృహాలకు డిమాండ్ పెరుగుతుందని, ప్రభుత్వ ప్రకటనలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన లేదని స్పష్టంచేశారు.
సంక్షోభంలో రియల్ రంగం
22ఏ పేరుతో భూములను బ్లాక్ చేయడం, హైడ్రా పేరుతో సెలెక్టివ్ డెమాలిషన్లు చేపట్టడం, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించడం వల్ల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో పడిందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ విధానాలు, అనిశ్చితి, బెదిరింపుల కారణంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నదని, దీని ప్రభావం లక్షలాది మంది నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాలపై ఆధారపడిన కుటుంబాల జీవనోపాధిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్నదని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. నైట్‌ఫ్రాంక్ నివేదిక కూడా ఇదే విషయం స్పష్టం చేసిందని తెలిపారు.
గాంధీలకు బాడీగార్డుల్లా రేవంత్‌రెడ్డి
రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి గాంధీ కుటుంబానికి బాడీగార్డులా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఆయనపై ఉన్నదని, పార్టీ అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి రాష్ట్ర గౌరవాన్ని దిగజార్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీజేపీలోనూ ఇదే బానిస సంస్కృతి కొనసాగుతున్నదని దుయ్యబట్టారు. అమిత్ షా కాళ్లకు రామచందర్‌రావు మొకడం, ఆయన చెప్పులు మోయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా బౌన్సర్లా, బాడీగార్డులా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పదవుల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దని, కాంగ్రెస్, బీజేపీ నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు.
భారత్ సమ్మిట్ కాదు.. కాంగ్రెస్ సమ్మిట్
భారత్ సమ్మిట్ వల్ల తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలుగలేదని కేటీఆర్ విమర్శించారు. అది అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించుకున్న రాజకీయ సమ్మిట్ తప్ప రాష్ట్రానికి ఏం ఉపయోగం అని ప్రశ్నించారు. ఇందుకోసం రూ.100 కోట్ల ప్రజాధనం ఖర్చు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమయంలో ఆ మొత్తాన్ని రైతులకు సహాయంగా అందించినా, ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగించినా ఎంతో ప్రయోజనం ఉండేదని హితవు పలికారు. ప్రచార ఆర్భాటాలకు, రాజకీయ ప్రయోజనాలకు ప్రజాధనాన్ని ఖర్చు చేయడం మానుకోవాలని సూచించారు.
గ్లోబల్ సమ్మిట్ కాదు.. గోబెల్స్ సమ్మిట్
దావోస్, అమెరికా, యూరప్ పర్యటనల్లో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వాటిలో ఎన్ని వాస్తవ రూపం దాల్చా యో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎన్ని సంస్థలు తెలంగాణలో పరిశ్రమలు స్థాపించాయి? ఎన్ని ఉద్యోగాలు కల్పించారో ప్రజల ముందుంచాలని కోరారు. గత గ్లోబల్ సమ్మిట్‌లో ప్రకటించిన పెట్టుబడుల పరిస్థితి ఏమిటో ఇప్పటివరకు ప్రభుత్వం వెల్లడించలేదని విమర్శించారు. గతంలో ప్రకటించిన పెట్టుబడులు ఎన్ని అమలయ్యాయో చెప్పకుండా మళ్లీ కొత్త సమ్మిట్ నిర్వహించడం ప్రజలను మభ్యపెట్టడమేనని మండిపడ్డారు. అందుకే అది గ్లోబల్ సమ్మి ట్ కాదని గోబెల్స్ సమ్మిట్ అని వ్యాఖ్యానించారు.
పేర్లు మార్చిస్తే జీవితాల్లో మార్పు రాదు
అన్నపూర్ణ క్యాంటీన్ పేరును ఇందిరమ్మ క్యాంటీన్‌గా మార్చినంత మాత్రాన ప్రజల జీవితాల్లో మార్పు రాదని కేటీఆర్ స్పష్టంచేశారు. కేసీఆర్ కిట్ వంటి విజయవంతమైన పథకాన్ని పేరు మార్చడమే కాకుండా పూర్తిగా ఎత్తివేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఇష్టం లేకపోతే ఇందిరమ్మ కిట్ అని పేరు పెట్టుకోవచ్చు కదా? అని అన్నారు. అన్నపూర్ణ దేవత పేరుతో ఉన్న పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. కేసీఆర్ తన పేరు మీద ప్రాజెక్టులకు పేర్లు పెట్టుకోలేదని, కాళేశ్వరం అనేది ప్రాంతం, దైవ సంబంధమైన పేరని గుర్తుచేశారు. లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ బ్యారేజీలు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్, రాజరాజేశ్వరసాగర్లకు దేవుండ్లు, దేవతల పేర్లు పెట్టారని వివరించారు. జైపాల్‌రెడ్డి పేరుతో కొత్త జిల్లా ఏర్పాటు చేస్తున్నారనే ప్రచారంపై తనకు స్పష్టమైన సమాచారం లేదని చెప్తూనే, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఆయన పేరు పెట్టినట్టు ఉన్నదని వ్యాఖ్యానించారు. జీవితాంతం జైపాల్‌రెడ్డిని రేవంత్‌రెడ్డి దూషించి, ఇప్పుడు ఆయన పేరు పెట్టడం విడ్డూరమని మండిపడ్డారు.
మూసీలో పోసే 10 టీఎంసీల నీళ్లు ప్రజలకు ఇవ్వొచ్చు కదా?
మూసీ ప్రాజెక్టు కోసం 10 టీఎంసీల నీళ్లు తీసుకొస్తామని చెప్తున్న ప్రభుత్వం.. ఆ నీటిని హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు వినియోగిస్తే మంచిదని కేటీఆర్ హితవు పలికారు. ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్న సమయంలో నగరంలో మంచినీటి సమస్యే లేదని చెప్పడం వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు. మంచినీటి కొరత లేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. మంత్రుల క్వార్టర్లకు నీళ్లు వస్తే రాష్ట్రవ్యాప్తంగా మంచినీటి సమస్య లేదని భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. ఒక అక్టోబర్ నెలలోనే 2.50 లక్షల వాటర్ ట్యాంకర్లకు బుకింగ్‌లు వచ్చాయని గుర్తుచేశారు. మూసీ ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొనేందుకు వెళ్లినప్పుడు వారిని అడ్డుకున్నారని విమర్శించారు. మూసీప్రాజెక్టుకు ఇప్పటివరకు డీపీఆర్ సిద్ధం కాలేదని ఆరోపించారు. ‘ప్రాజెక్ట్ బిడ్ వితౌట్ ప్రాజెక్ట్ రిపోర్ట్’ అంటూఎండగట్టారు.
72శాతం కాంట్రాక్టుల హామీ ఏమైంది?
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 72శాతం వాటా కేటాయిస్తామని హామీ ఇచ్చిందని కేటీఆర్ గుర్తుచేశారు. ఇందులో 42% బీసీలకు, 30% ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని ప్రకటించిందని చెప్పా రు. అధికారంలోకి వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మేఘా కృష్ణారెడ్డికి తప్ప రాష్ట్రంలో ఇతరులకు కాం ట్రాక్టులు దకుతున్నాయా? అని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఎంతమంది కాంట్రాక్టర్లకు ఎన్ని పనులు కేటాయించారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.
కరువును పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం
రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి సహాయక చర్యలు ప్రకటించలేదని కేటీఆర్ విమర్శించారు. 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ రైతులకు ఎలాంటి సహాయం అందడం లేదని మండిపడ్డారు. కేంద్ర బృందాలను రాష్ట్రానికి రప్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటని, ప్రధానమంత్రిని కలిసిన ముఖ్యమంత్రి కరువు సహాయక ప్యాకేజీ గురించి ఒక మాటైనా మాట్లాడారా? అని నిలదీశారు. కరువు సహాయక ప్యాకేజీ ప్రకటించడంతోపాటు రుణాలను రీషెడ్యూల్ చేసి, అందుబాటులో ఉన్న కాళేశ్వరం, కృష్ణా జలాలను సాగుకు వినియోగించాలని డిమాండ్ చేశారు.
అభ్యర్థుల ఎంపికలో పార్టీదే తుది నిర్ణయం
వచ్చే ఎన్నికల్లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. అభ్యర్థుల ఎంపిక, పోటీ చేసే స్థానాల విషయంలో పార్టీ సమగ్రంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కేసీఆర్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
రీ ట్వీట్ చేస్తే 20 రోజులు జైలా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలపై విమర్శలు చేసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు నమోదు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ సమ్మిట్‌లో రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్యం గురించి ఉపన్యాసాలు ఇచ్చారని గుర్తుచేస్తూ, తెలంగాణలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రజాస్వామ్యం గురించి కూడా మాట్లాడాలని సూచించారు. స్వయంగా పోస్టు చేయకుండా కేవలం ఒక పోస్టును రీట్వీట్ చేసినందుకు ఒక వ్యక్తిని 20 రోజులు జైలులో పెట్టడం ఏ రకమైన ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు.
సాగునీటి రంగంలో బీఆర్ఎస్ ప్రగతిపై వివరాలు వెల్లడిస్తా
బీఆర్ఎస్ హయాంలో సాగునీటి రంగంలో సాధించిన ప్రగతిపై పూర్తి వివరాలను త్వరలోనే స్పష్టమైన గణాంకాలతో వెల్లడిస్తానని కేటీఆర్ తెలిపారు. ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు? ఎన్ని అనుమతులు తీసుకొచ్చామో? ఎన్ని బ్యారేజీలు, రిజర్వాయర్లు నిర్మించామో? అనే వివరాలను ప్రజల ముందు ఉంచుతానని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడిచినా ప్రాజెక్టుల డీపీఆర్‌లను ఎందుకు వెనకి తీసుకుంటున్నదని ప్రశ్నించారు. ఈఎన్సీ, ఆదిత్యానాథ్‌దాస్ వ్యవహారాలపైనా పూర్తి వివరాలతో మాట్లాడుతానని చెప్పారు.
సీఎం ఎకడికి వెళ్లినా అభివృద్ధి గురించే మాట్లాడాలి
ముఖ్యమంత్రి ఏ నియోజకవర్గానికి వెళ్లినా అకడి ప్రజలకు ఉపయోగపడే నాలుగు మంచి పనులు, నాలుగు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడాలని కేటీఆర్ హితవు పలికారు. ముఖ్యమంత్రి వస్తే ప్రజలు అభివృద్ధి పనుల ప్రకటనలు, సమస్యలకు పరిషారాలు ఆశిస్తారని, కానీ ఎకడికి వెళ్లినా తిట్ల పురాణం, ఆరోపణలు, విమర్శలే వినిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. సిరిసిల్లకు వచ్చిన ముఖ్యమంత్రి అకడి ప్రజలకు, ముఖ్యంగా నేతన్నలకు మూడేండ్లలో ప్రభుత్వం చేసిన పనులు చెప్పాల్సి ఉండేదని పేర్కొన్నారు. నేతన్నల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన బతుకమ్మ చీరల పథకాన్ని రద్దు చేశారని, చేనేత మిత్ర పథకాన్ని నిలిపివేశారని, నేతన్నకు బీమా పథకాన్ని కూడా రేవంత్ సర్కార్ కొనసాగించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఫోన్ ట్యాపింగ్‌పై మూడేండ్ల డ్రామా సరిపోలేదా?
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం రాజకీయంగా ఉపయోగించుకుంటున్నదని కేటీఆర్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో మూడేండ్లుగా ప్రభుత్వం నాటకాలు ఆడుతున్నదని విమర్శించారు. ప్రజలు దృష్టి మరల్చడానికి, ఏదో టైం పాస్ కార్యక్రమాలు చేసి మీడియా మేనేజ్మెంట్తో డైవర్షన్ డ్రామాలు రేవంత్ ఆడుతున్నారని విమర్శించారు.
రాష్ట్ర సాధనలో ప్రజల త్యాగాలను, కేసీఆర్ నాయకత్వాన్ని కాంగ్రెస్ విస్మరించే ప్రయత్నం చేస్తున్నది. కోట్లాది ప్రజల ఆకాంక్షలు, పోరాటాలు, కేసీఆర్ నాయకత్వంలోని ఉద్యమ ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ ఎవరి దయాభిక్ష కాదు.. ప్రజల పోరాటంతో సాధించుకున్న హకు. ఈ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ చెరిపివేయలేదు.
– కేటీఆర్
అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షా దివస్ సభలు
దీక్షా దివస్‌ను అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఘనంగా నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. ప్రతిచోటా దీక్షాదివస్ స్ఫూర్తి సభల పేరుతో పూర్తిస్థాయి సభలు, సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ఘటనలు, కేసీఆర్ చేపట్టిన దీక్షను, ఆ సమయంలో పార్టీ శ్రేణులు చేసిన పోరాటాన్ని మరోసారి గుర్తుచేసుకునేలా ఈ నెల 29న కార్యక్రమాలు ఉంటాయని వివరించారు.
ఎన్నికల ముందు అభయహస్తం.. తర్వాత రిక్తహస్తం
కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోను ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం, దగాగా కేటీఆర్ అభివర్ణించారు. ఎన్నికల ముందు అభయహస్తం చూపించి, అధికారంలోకి వచ్చాక ప్రజలకు రిక్తహస్తం చూపించారని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు సహా అన్ని వర్గాలకు నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. మూడేండ్ల పాలనలో రాష్ట్రం సాధించింది శూన్యమని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడమే సాధించిన ఘనతనా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, ప్రభుత్వ భూములను అమ్ముతూ, కుదువపెడుతూ రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. మూడేండ్లకే రాష్ట్ర పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మరో రెండేండ్లు ఈ ప్రభుత్వాన్ని ఎలా భరించాలని ప్రజలు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఏం రాసుకున్నారో ఆ పార్టీ నాయకులకే గుర్తుందో లేదోనని ఎద్దేవా చేశారు. మొదటి వంద రోజులు, చివరి వంద రోజులు అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు గతంలోనూ జరిగాయని, చివరికి ప్రజలే తగిన తీర్పు ఇచ్చారని హెచ్చరించారు.
తెలంగాణ నాట్ రైజింగ్..
తెలంగాణ ఫాలింగ్. భూముల ధరలు పడిపోతున్నాయి, ఐటీ ఉద్యోగాలు తగ్గుముఖం పడుతున్నాయి, అవినీతి, బంధుప్రీతి, రైతుల ఆత్మహత్యల్లో మాత్రమే తెలంగాణ రేసింగ్‌లో ఉన్నది. మూడేండ్ల్లలో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని గొప్పలు చెప్తున్న ప్రభుత్వం.. వాటిలో ఎన్ని వాస్తవరూపం దాల్చాయో? ఎన్ని పరిశ్రమలు ప్రారంభమయ్యాయో? ఎన్ని ప్రాజెక్టులు అమలయ్యాయో? ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో? శ్వేతపత్రం విడుదల చేయాలి.
– కేటీఆర్
కరీంనగర్లో దీక్షాదివస్ భారీ సభ
కరీంనగర్ జిల్లా అలుగునూరులో 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన, కేసీఆర్ అరెస్టయిన ప్రాంతంలోనే ఈ నెల 29న ప్రత్యేకంగా భారీ సభ నిర్వహిస్తామని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టానికి వేదికైన దీక్షా దివస్ సభను ప్రత్యేకంగా నిర్వహిస్తామని చెప్పారు. ఉద్యమ సమయంలో పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, కళాకారులు, ఉద్యమకారులందరినీ గుర్తించి గౌరవిస్తామని తెలిపారు. తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేసుకుంటూ పార్టీ శ్రేణుల్లో ఉద్యమస్ఫూర్తి నింపుతామని చెప్పారు. పార్టీ శ్రేణులందరూ ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సోనియాగాంధీ ఆత్మకథలో తెలంగాణ లేదు. ఆమె మనసులో కూడా తెలంగాణ లేదు. తెలంగాణపై కాంగ్రెస్‌కు ఎన్నడూ నిజమైన ప్రేమ లేదు. ఉద్యమ ఉప్పెనలో కొట్టుకుపోతామన్న భయంతోనే ఆ పార్టీ తెలంగాణ ఇచ్చింది. అది ప్రజల పోరాట ఫలితం. కేసీఆర్ నాయకత్వంలో సాగిన ప్రజా ఉద్యమమే ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావానికి అసలు కారణం.
– కేటీఆర్
ప్రాజెక్టుల పేర్లు మారిస్తే మీ పేర్లూ మార్చుతాం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు, పథకాలకు పేర్లు మార్చితే.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న అన్ని ప్రాజెక్టుల పేర్లను మార్చే బాధ్యత తాను తీసుకుంటానని కేటీఆర్ హెచ్చరించారు. రాజీవ్‌గాంధీ విమానాశ్రయం, ఇందిరాగాంధీ ఓపెన్ యూనివర్సిటీ, రాజీవ్‌సాగర్, ఉప్పల్ స్టేడియం తదితర పేర్ల విషయంలోనూ ఇదే విధానం అనుసరిస్తామని స్పష్టంచేశారు.
నాగార్జునసాగర్ వంటి ప్రాజెక్టుల పేర్లపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టడమే తమ అభ్యంతరమని స్పష్టంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రైతుల జీవన విధానాన్ని మార్చిన గొప్ప ప్రాజెక్టు అని, దాని పేరు మార్చడం వల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల పట్ల తమ ప్రభుత్వానికి గౌరవం ఉన్నదని గుర్తుచేశారు. ట్యాంక్‌బండ్‌పై కాకా వెంకటస్వామి విగ్రహాన్ని, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని తమ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, పీవీ నరసింహారావు పేర్లతో విద్యాసంస్థలు ఏర్పాటు చేశామని చెప్పారు. వారు కాంగ్రెస్‌కు చెందిన నాయకులే అయినప్పటికీ వారి సేవలను గుర్తించి గౌరవించామని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

