Vinay Bhaskar | వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లోని (MGM Hospital) పైకప్పు పెచ్చులు ఊడి గాయాలైన రోగుల పరిస్థితి తెలుసుకునేందుకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఎంజీఎం ఆసుపత్రిలో వెళ్లే క్రమంలో ఆయనను అడ్డుకున్న పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని తెలిసిందే. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వినయ్ భాస్కర్ కడుపులో తన్నారు. పోలీసులు కడుపులో తన్నారని, దాడిలో తన చేయి విరిగిందంటూ వినయ్ భాస్కర్ కంటతడి పెట్టుకున్నారు.
కాగా ఈ ఘటనపై అక్కడే ఉన్న మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంజీఎం ఆసుపత్రి వద్ద వినయ్ భాస్కర్‌ను అడ్డుకొని దాడి చేసిన పోలీసుల తీరుపై మండిపడ్డారు. పోలీసులకేంది.. ఎందుకు ఆపాలి.. వాళ్లను ఎందుకు కొట్లాలి. పోలీసులు ఎందుకు ఆపాలి వాళ్లను.. మనుషులా.. దున్నపోతులా..? ఆయన మా న్యాయం మాకు చేస్తుండు.. పోలీసోళ్లు కొట్టుడు అవసరమా..? వీళ్లను తీసేయాలంటూ ఫైర్ అయ్యారు. పోలీసుల దురుసు ప్రవర్తనపై బీఆర్ఎస్ నేతలతోపాటు స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద వినయ్ భాస్కర్‌ను అడ్డుకొని దాడి చేసిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు https://t.co/lFHL52ACJc pic.twitter.com/raFsZrzAuc
— Telugu Scribe (@TeluguScribe) September 22, 2026
Viral news | అన్నా అంటూ మూడేళ్లు రాఖీ కట్టింది.. ఆఖరికి భర్తను వదిలేసి అతడితో లేచిపోయింది..!
girl molested in Bihar | యువ జంటను అడ్డుకుని వేధించిన కొందరు.. బాలికపై అసభ్యకర ప్రవర్తన