Rajya Sabha polls | రాజ్యసభ సీట్లకు ఎన్నిక.. 12 స్థానాలకు నోటిఫికేషన్.. అక్టోబర్ 16న ఎన్నిక
Rajya Sabha polls : రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 22, మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది.
Rajya Sabha polls : రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 22, మంగళవారం నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో యూపీలో 10 స్థానాలకు, ఉత్తరాఖండ్లో ఒక స్థానానికి ఎన్నిక జరగనుండగా, పశ్చిమ బెంగాల్లో ఒక స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. అక్టోబర్ 16న ఎన్నిక జరగనుంది. అదే రోజు ఫలితాలు విడుదలవుతాయి. కొందరు రాజ్యసభ సభ్యుల కాల పరిమితి నవంబర్ 25న ముగియనుంది.
ఈ స్థానాల భర్తీ కోసం తాజా ఎన్నికలు జరుగుతాయి. ఇందులో యూపీలో ఉన్న 10 స్థానాల్లో 8 స్థానాలు బీజేపీవి, ఒకటి ఎస్పీది, ఇంకోటి బీఎస్పీది. కాల పరిమితి ముగియనున్న రాజ్యసభ సభ్యుల్లో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఉన్నారు. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం.. అసెంబ్లీలో ఉన్న స్థానాలను బట్టి యూపీలోని 10 స్థానాల్లో 8 బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది. 2 సీట్లు సమాజ్వాదీ పార్టీ గెలుచుకోనుంది. సిట్టింగ్ రాజ్యసభ ఎంపీని కలిగి ఉన్న బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆ పార్టీకి యూపీ అసెంబ్లీలో సభ్యులు లేనందున ఆ పార్టీకి రాజ్యసభ సీటు దక్కే అవకాశం లేదు.
బీఎస్పీకి ఇది క్లిష్టకాలంగా చెప్పుకోవాలి. ఎందుకంటే యూపీ అసెంబ్లీలోని ఉభయ సభల్లో ఒక్కరు కూడా లేరు. పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా ఒక్క సభ్యుడూ లేడు. అంటే, రాష్ట్రంలో, కేంద్రంలోని చట్ట సభల్లో ఒక్క సభ్యుడు కూడా లేని స్తితికి బీఎస్పీ చేరుకుంది. 1989 తర్వాత బీఎస్పీకి ఈ పరిస్థితి ఇదే తొలిసారి. ఇక, ఉత్తరాఖండ్లో ఉన్న ఒక్క స్థానాన్ని బీజేపీ దక్కించుకోనుంది. ఆ పార్టీకి అసెంబ్లీలో భారీ మెజారిటీ ఉన్నందున ఆ రాజ్యసభ సీటు బీజేపీకే దక్కనుంది. పశ్చిమ బెంగాల్లో కూడా ఈ సీటును బీజేపీయే గెలుచుకోనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
Randhir Jaiswal: అమెరికా టెంపుల్ ఘటనపై భారత్ ఆందోళన
Shai Hope | వరసగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు.. ‘అమ్మో.. ఇన్ని ఎలా?’ అని తలపట్టుకున్న విండీస్ కెప్టెన్..!
Actor Brahmaji | ప్రజా ఉద్యమాలపై బ్రహ్మాజీ సెటైరికల్ పోస్ట్.. ట్రోలింగ్ తర్వాత క్లారిటీ!
Marri Janardhan Reddy | ఎన్హెచ్ఎం ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలి : మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

