Visa-free facility | వీసా ఫ్రీ ట్రావెల్‌ను దుర్వినియోగం చేయొద్దు.. భారత హై కమిషన్ అడ్వయిజరీ..!
Visa-free facility | మలేసియా (Malasia) వచ్చే భారత ప్రయాణికులకు కౌలాలంపూర్ (Kaulalampur) లోని భారత హైకమిషన్ (High Commission of India) కీలక సూచన చేసింది. మలేసియా అందిస్తున్న 30 రోజుల వీసా ఫ్రీ ట్రావెల్‌ను దుర్వినియోగం చేయొద్దని సూచించింది. దాన్ని ఉపాధి అవకాశాల కోసం వినియోగించొద్దని పేర్కొన్నది.
Visa-free facility : మలేసియా (Malasia) వచ్చే భారత ప్రయాణికులకు కౌలాలంపూర్ (Kaulalampur) లోని భారత హైకమిషన్ (High Commission of India) కీలక సూచన చేసింది. మలేసియా అందిస్తున్న 30 రోజుల వీసా ఫ్రీ ట్రావెల్‌ను దుర్వినియోగం చేయొద్దని సూచించింది. దాన్ని ఉపాధి అవకాశాల కోసం వినియోగించొద్దని పేర్కొన్నది. నకిలీ జాబ్ ఆఫర్లతో మలేసియాకు వస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు అడ్వైజరీ జారీచేసింది.
ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు ఏజెంట్లు నిరుద్యోగులకు వల వేస్తున్నారని, వారి చేతిలో చాలామంది మోసపోతున్నారని హైకమిషన్ తన అడ్వైజరీలో పేర్కొన్నది. పర్యాటక లేదా వీసా ఫ్రీ ట్రావెల్‌పై వచ్చి ఇక్కడ గడువుకు మించి ఉండిపోతున్నారని, దాంతో చట్టపరంగా చర్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది. భారత పాస్‌పోర్ట్ కలిగిన వారికి ఇస్తున్న 30 రోజుల వీసా రహిత ప్రవేశం (Visa free travel) కేవలం పర్యాటకం, సామాజిక సందర్శన కోసం ఉద్దేశించినది మాత్రమేనని భారత హైకమిషన్ తెలిపింది.
దీన్ని ఉపాధి అవసరాల కోసం వినియోగించడం మలేసియా వలస నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నది. కాబట్టి వర్క్ పర్మిట్ లేకుండా మలేసియాకు రావొద్దని సూచించింది. అలాగే మలేసియా వచ్చే సాధారణ ప్రయాణికులు సైతం రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ వంటి ట్రావెల్ ప్రణాళికతో రావడంవల్ల ఇమిగ్రేషన్ ఇబ్బందులు తలెత్తవని పేర్కొన్నది. పాస్‌పోర్టు వ్యాలిడిటీ కూడా కనీసం 6 నెలలు చెల్లుబాటులో ఉండేవిధంగా ఉండాలని సూచించింది. మలేసియా ఈ ఏడాది చివరివరకు భారత పౌరులకు వీసా ఫ్రీ ట్రావెల్ సదుపాయాన్ని అందిస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

