బూర్గంపహాడ్, మార్చి 13 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో ఐటీసీ పీఎస్పీడీ సీఎస్ఆర్ నిధులు రూ.50 లక్షలతో చేపట్టిన నాలుగు సైడ్ డ్రైన్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామంలో డ్రైనేజీ నిర్మాణాలకు ఐటీసీ నిధులు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. మండల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే సందెళ్ల రామాపురంలో సమ్మక్క, సారలమ్మ జాతరలో పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జమలారెడ్డి, ఐటీసీ అడ్మిన్ మేనేజర్ చెంగల్రావు, మాజీ సొసైటీ చైర్మన్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, లక్ష్మీపురం మాజీ ఉప సర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, బాదం రమేశ్‌రెడ్డి, నాగిరెడ్డి, కైపు శ్రీనివాసరెడ్డి, భజన సతీశ్, ప్రసాద్, గుండె వెంకన్న, ఇంగువ రమేశ్, మారం వెంకటేశ్వరరెడ్డి, ఎడమకంటి సుధాకర్‌రెడ్డి, సారెడ్డి అశోక్‌రెడ్డి, నిమ్మల హరీశ్, దునుకు రాము, కందుల రాము, నరేశ్, బాలకృష్ణ, కాటం వెంకట్రామిరెడ్డి, గాదె వెంకటేశ్వరరెడ్డి, ఎడమకంటి రోశిరెడ్డి, శేషిరెడ్డి, ఆవుల నాగిరెడ్డి, పాలెం లక్ష్మిరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.