అనంతగిరి, మార్చి 13 : అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్, ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు డిజైన్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్,ఇన్నోవేషన్ డిజైన్ అనే అంశాలపై రెండు రోజులు పాటు కొనసాగిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. కేఎల్ యూనివర్సిటీ ఎలక్ట్రికల్ విభాగ ఆచార్యులు, డైరెక్టర్ సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ ఇంక్విబేషన్ అలాగే ఎంటర్ పెన్షన్ కె.నర్సింహారాజు విద్యార్థులకు, బోధనా సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆలోచనల రూపకల్పన, సమస్యల పట్ల ఆలోచన విధానం, యాజమాన్య నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
కేస్ స్టడీస్ ద్వారా సమస్యలు గుర్తించి వినియోగదారుడి అవసరాలకు అనుగుణంగా టెస్టింగ్, వేగవంతంగా అంచనాలు వేయడం తదితర విషయాలను ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ ఇలాంటి వర్క్ షాపుల ద్వారా విద్యార్థులు ఉత్తమ ఆలోచనలకు పదును పెట్టి ఉత్తమ మార్గాన్ని నేర్చుకోవడానికి దోహద పడతాయన్నారు. కార్యక్రమాన్ని సీఎస్సీ, డిప్లొమా ఇన్చార్జిలు డాక్టర్ వైవిఆర్ నాగ పవన్, డాక్టర్ జే.శ్రీనివాసరావు పర్యవేక్షించారు.