భువనేశ్వర్: ఒక వ్యక్తి గ్యాస్ మెకానిక్‌గా నటించాడు. యూనివర్సిటీలోని క్వాటర్స్లోకి వచ్చాడు. గ్యాస్ సిలిండర్ తనిఖీ పేరుతో ప్రొఫెసర్ ఇంట్లోకి ప్రవేశించాడు. ఒంటరిగా ఉన్న ప్రొఫెసర్ భార్యపై అత్యాచారానికి ప్రయత్నించాడు. (Man Tries To Rape Professor’s Wife) బీజేపీ పాలిత ఒడిశాలో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం బాలాసోర్ జిల్లాలోని ఫకీర్ మోహన్ విశ్వవిద్యాలయంలోని క్వాటర్స్లోకి ఒక వ్యక్తి ప్రవేశించాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటికి వెళ్లి డోర్ బెల్ నొక్కాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ప్రొఫెసర్ భార్య తలుపు తెరిచింది.
కాగా, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ చెకప్ కోసం వచ్చినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత మెయిన్ డోర్ లాక్ చేశాడు. ప్రొఫెసర్ భార్యపై అత్యాచారానికి యత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకున్న ఆ మహిళ మరో గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసింది. తన భర్తకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. అలాగే సహాయం కోసం కేకలు వేసింది.
మరోవైపు వర్సిటీ క్వాటర్స్ గేటు వద్ద ఉన్న భద్రతా సిబ్బంది అలెర్ట్ అయ్యారు. ఆ ఇంటికి చేరుకున్నారు. పారిపోయేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నీలగిరి ప్రాంతంలో నివసించే శంకర్ పాత్రగా నిందితుడ్ని గుర్తించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు. కాగా, ఆ యూనివర్సిటీ ప్రాంగణంలో అధికారిక గృహాలతో పాటు లేడీ హాస్టల్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంఘటన కలకలం రేపింది.
Also Read:
Rave Party Raid | రేవ్ పార్టీపై పోలీసులు రైడ్.. మాజీ మంత్రి అల్లుడుతో పాటు పలువురు అరెస్ట్
Newlywed man becomes thief | భార్య విలాస కోరికలు తీర్చేందుకు.. దొంగగా మారిన కొత్తగా పెళ్లైన వ్యక్తి
Wife Poisons Husband Twice | వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్తకు రెండుసార్లు విషమిచ్చి చంపిన భార్య