పాట్నా: హోంగార్డు సెలక్షన్ కోసం హాజరైన మహిళ భౌతిక పరీక్షలో స్పృహ కోల్పోయింది. ఆమెను హాస్పిటల్‌కు తరలిస్తుండగా కదులుతున్న అంబులెన్స్‌లో నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. (Woman Gang-Raped In Moving Ambulance) ఎన్డీయే అధికారంలో ఉన్న బీహార్‌లో ఈ దారుణం జరిగింది. జూలై 24న బోధ్ గయలోని బీహార్ మిలిటరీ పోలీస్ గ్రౌండ్లో హోంగార్డుల నియామకం కోసం ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించారు. ఈ టెస్ట్‌లో పాల్గొన్న 26 ఏళ్ల మహిళ స్పృహ కోల్పోయింది. వెంటనే స్పందించిన అధికారులు అక్కడున్న అంబులెన్స్‌లో ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.
కాగా, స్పృహ కోల్పోయిన ఆ మహిళపై కదులుతున్న అంబులెన్స్‌లో నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. హాస్పిటల్‌కు తరలించిన తర్వాత వైద్య సిబ్బంది, పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఆమె స్టేట్మెంట్ ఆధారంగా బోధ్ గయ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశారు. ఆధారాల సేకరణకు ఫోరెన్సిక్ బృందాన్ని నియమించారు.
మరోవైపు అంబులెన్స్ కదలికలు, హాస్పిటల్‌కు చేరుకున్న సమయానికి సంబంధిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. కదులుతున్న అంబులెన్స్‌లో అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళపై గ్యాంగ్‌రేప్ జరిగినట్లు నిర్ధారించారు. అంబులెన్స్ డ్రైవర్ వినయ్ కుమార్, టెక్నీషియన్ అజిత్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. పోలీస్ కస్టడీలో ఉన్న వారిద్దరిని ప్రశ్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Shivakumar, Siddaramaiah aides clash | సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సహాయకుల మధ్య.. ఢిల్లీలో ఘర్షణ
Jawan Killed By Live-In Partner | మూడేళ్లుగా సహజీవనం.. భాగస్వామి చేతిలో హత్యకు గురైన జవాన్