Donald Trump : ఇరాన్ (Iran) పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) దాడుల నేపథ్యంలో ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం మరో నాలుగైదు వారాలపాటు కొనసాగే అవకాశం ఉందని అన్నారు.
‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ పూర్తిస్థాయిలో కొనసాగుతోందని ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా తనపై గతంలో జరిగిన హత్యాయత్నాల ఘటనలను ఆయన ప్రస్తావించారు. ‘ఖమేనీ ప్రోద్బలంతో నాపై రెండుసార్లు హత్యాయత్నాలు జరిగాయని, కానీ నేను మొదటి ప్రయత్నంలోనే అతడి కథ కంచికి చేర్చా’ అని పేర్కొన్నారు. ‘నన్ను పట్టుకోకముందే నేనే అతడిని పట్టుకొన్నా’ అని చెప్పారు.
ఇరాన్ (War with Iran) పై ఆపరేషన్ క్లిష్టమైనదేనని, కానీ విస్తృత స్థాయిలో దాడులు జరుపుతున్నామని ట్రంప్ అన్నారు. అవసరమైతే ఈ ఆపరేషన్ నాలుగైదు వారాలు కొనసాగవచ్చునని తెలిపారు. యుద్ధ తీవ్రతను ఇదేవిధంగా కొనసాగించడం ఇజ్రాయెల్ (Israel), అమెరికాకు కష్టమేమీ కాదని అన్నారు. చర్చల కోసం తమ దౌత్య మార్గాలు ఇప్పటికీ తెరిచే ఉన్నాయని తెలిపారు.
కాగా ఇరాన్‌పై ఆపరేషన్‌లో ఇప్పటివరకు అమెరికా (USA) కు చెందిన ముగ్గురు సైనికులు మరణించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. తమ సైనికుల మృతికి ప్రతీకారం
తీర్చుకుంటామన్నారు. అయితే యుద్ధం ముగిసేలోపు మరింత ఎక్కువ మంది అమెరికా సైనికులు మృతిచెందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్లో దాదాపు 200 మంది మరణించారు. ఖమేనీతోపాటు పలువురు సీనియర్ మిలిటరీ కమాండర్లు, రాజకీయ ప్రముఖులు కూడా మృతి చెందినట్లు సమాచారం. ఇదిలావుండగా.. ఇరాన్ ఐఆర్జీసీ, మిలిటరీ దళాలు ఆయుధాలు వీడితే వారికి రక్షణ కల్పిస్తామని
ట్రంప్ వెల్లడించారు. లేదంటే వారికి చావు తప్పదని హెచ్చరించారు. తన ఆఫర్‌ను వాడుకొని ఇరాన్ ప్రజలు స్వేచ్ఛ పొందాలని పిలుపునిచ్చారు.
ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన, భయంకరమైన మిలిటరీ దాడులను చూస్తున్నామని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. ఇరాన్ దీర్ఘశ్రేణి అణ్వాయుధాలను కలిగిఉండటం అమెరికా భద్రతకు పెనుముప్పు అని పేర్కొన్నారు. దాన్ని అడ్డుకోవడం కోసమే తాము ఈ దాడులు చేపట్టామన్నారు. తమ లక్ష్యాలన్నీ నెరవేరేవరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు.