తిరంగా సగర్వంగా ఎగరంగా.. జూలూరుపాడులో 1,200 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం దేశభక్తి భావనతో పులకించిపోయింది. జాతీయ సమైక్యతను చాటిచెబుతూ స్థానిక 'ఆరోగ్య జీవనయాత్ర వాకింగ్ క్లబ్' బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 1,200 మీటర్ల భారీ తిరంగా ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.
జూలూరుపాడు, ఆగస్టు 14 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రం దేశభక్తి భావనతో పులకించిపోయింది. జాతీయ సమైక్యతను చాటిచెబుతూ స్థానిక ‘ఆరోగ్య జీవనయాత్ర వాకింగ్ క్లబ్’ బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన 1,200 మీటర్ల భారీ తిరంగా ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానిక సాయిబాబా దేవాలయం వద్ద అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమైన ఈ మహా ప్రదర్శన, పోలీస్ స్టేషన్ వరకు ప్రధాన రహదారి గుండా అట్టహాసంగా సాగింది. వందల సంఖ్యలో చేతులు ఆ భారీ త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ముందుకు నడిపిస్తుంటే జూలూరుపాడు పురవీధులన్నీ దేశభక్తి శోభతో వెల్లివిరిశాయి.
ర్యాలీ సాగుతున్నంత సేపు యువత, విద్యార్థులు చేసిన “భారత్ మాతా కీ జై”, “వందేమాతరం” నినాదాలతో పరిసరాలు మారుమోగాయి. అనంతరం చండ్రుగొండ రోడ్డు కూడలి వద్ద భారీ ఎత్తున మానవహారం నిర్వహించి, దేశ ఐక్యతకు కట్టుబడి ఉంటామని ప్రతినబూనారు. వ్యాపారస్తులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఒకే తాటిపై నడిచి ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

తిరంగా సగర్వంగా ఎగరంగా.. జూలూరుపాడులో 1,200 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

