Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఆటో ఢీ, నలుగురు మృతి
Road Accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ , ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
మంచిర్యాల : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ( Road Accident ) జరిగింది. లారీ , ఆటో ఢీ కొన్న ఘటనలో నలుగురు మృతి ( Four persons Died ) చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నస్పూర్ మండల కేంద్రంలో ఆటో రోడ్డు దాటుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్లోనే చనిపోగా మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. మృతులు మందమర్ని మండలం పొన్నారం గ్రామానికి చెందిన లక్ష్మి, వెంకటాపూర్‌కు చెందిన అగ్గు సౌందర్య, సోనియా , సుమలతగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి కేసు నమోదు చేశారు.
ప్రమాద స్థలాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్, ఏసీపి ప్రకాష్ సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను సిపి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. రోడ్డు ప్రమాదంపై మంత్రి గడ్డం వివేక్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వీరంతా తన నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో వృద్ధుల కుటుంబాలకు తక్షణసాయంగా 25 వేలు, గాయపడ్డ వరకు 10వేలు అందిస్తున్నట్లు ప్రకటించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
10 voters listed as Same Name | యూపీలో ‘వికాస్ యాదవ్’ పేరుతో 10 మంది ఓటర్లు.. 9 మంది అధికారులపై చర్యలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

