నాగర్ కర్నూల్ : జిల్లాలోని బిజినేపల్లి( Bijinepally ) మండలం గౌరారం గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్య ( Murder ) కు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కొల్లాపూర్ పట్టణానికి చెందిన జగన్(32), బిజినేపల్లి మండలం లట్టుపల్లి గ్రామానికి చెందిన పరుశురాములు గత ఆదివారం రాత్రి గౌరారం గ్రామంలో మద్యం మత్తులో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో జగన్ అనే వ్యక్తి మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, హత్యకు గల కారణాలపై విచారణ ప్రారంభించారు.