భువనేశ్వర్: ముగ్గురు వ్యక్తులు ఒక బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె గర్భవతి అని తెలియడంతో సజీవంగా పాతిపెట్టేందుకు ప్రయత్నించారు. సకాలంలో ఆ బాలికను రక్షించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (3 men rape Odisha girl) బీజేపీ పాలిత ఒడిశాలో ఈ దారుణం జరిగింది. జగత్పూర్ జిల్లాలోని బనాష్బారా గ్రామానికి చెందిన భాగ్యధర్ దాస్, పంచనన్ దాస్ అన్నాదమ్ములు. సహచరుడైన తుళు బాబుతో కలిసి 15 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, ఆ బాలిక గర్భందాల్చింది. ఆమె ఐదు నెలల గర్భవతి అని తెలిసిన ఆ ముగ్గురు ఆందోళన చెందారు. డబ్బులు ఇస్తామని, అబార్షన్ చేయించుకోవాలని ఆమెను బెదిరించారు. ఆ బాలికను ఒకచోటకు పిలిపించారు. ఆమెను సజీవంగా పాతిపెట్టేందుకు ముందుగానే పెద్ద గొయ్యి తీశారు.
మరోవైపు అక్కడకు చేరుకున్న ఆ బాలికను అబార్షన్ చేయించుకోవాలని ఆ ముగ్గురు బలవంతం చేశారు. లేకపోతే సజీవంగా గోతిలో పాతిపెడతామని బెదిరించారు. ఆ గొయ్యి చూసిన బాలిక భయాందోళన చెందింది. ఆమె కేకలు వేయడంతో ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. స్పందించిన స్థానికులు ఆ బాలికను కాపాడారు. ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు.
కాగా, బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అన్నాదమ్ములైన భాగ్యధర్ దాస్, పంచనన్ దాస్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు తుళు బాబును అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Man Kills Friend | సోషల్ మీడియాలో ప్రియురాలిని ఫాలో అవుతున్నందుకు.. ఫ్రెండ్‌ను హత్య చేసిన వ్యక్తి
Watch: వృద్ధురాలి పట్ల అమానుషం.. రాత్రివేళ రోడ్డు పక్కన పడేయడంతో మృతి
Watch: చిన్నారిని షూ ర్యాక్‌పై కూర్చోబెట్టిన తల్లి.. తర్వాత ఏం జరిగిందంటే?