లక్నో: ప్రియురాలిని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న ఫ్రెండ్ పట్ల ఒక వ్యక్తి ఆగ్రహించాడు. మరో ఇద్దరి సహాయంతో అతడ్ని రప్పించాడు. కత్తితో పొడిచి హత్య చేశాడు. (Man Kills Friend) దర్యాప్తు చేసిన పోలీసులు ముగ్గురు యవకులను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన వసీం, ఢిల్లీకి చెందిన 17 ఏళ్ల రెహాన్ స్నేహితులు. అయితే వసీం గర్ల్‌ఫ్రెండ్‌కు రెహాన్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అవుతున్నాడు.
కాగా, ఇది తెలుసుకున్న వసీం తన ఫ్రెండ్ రెహాన్పై ఆగ్రహించాడు. వాగ్వాదం తర్వాత అతడ్ని చంపేందుకు కుట్ర పన్నాడు. స్నేహితులైన సాహిల్, రాహిల్‌కు ఫోన్ చేశాడు. రెహాన్ హత్యకు సహకరిస్తే వారికి మందు పార్టీ ఇస్తానని హామీ ఇచ్చాడు. జూలై 21న రాత్రివేళ వారిద్దరూ కలిసి ఘజియాబాద్‌లోని లోనీ ప్రాంతానికి రెహాన్‌ను రప్పించారు. అక్కడ చిరుతిండి తినిపించారు. ఆ తర్వాత ఎలైచిపూర్ గ్రామానికి అతడ్ని తీసుకెళ్లారు.
మరోవైపు అక్కడ వేచి ఉన్న వసీంను వారు కలిశారు. రెహాన్ చేతులను సాహిల్ పట్టుకోగా వసీం కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. జూలై 22న రెహాన్ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులైన వసీం, సాహిల్, రాహిల్‌ను అరెస్ట్ చేశారు. రెహాన్ హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read:
Watch: చిన్నారిని షూ ర్యాక్‌పై కూర్చోబెట్టిన తల్లి.. తర్వాత ఏం జరిగిందంటే?
Teen Kills Self | తల్లి మరణాన్ని తట్టుకోలేక.. కుమారుడు ఆత్మహత్య
Watch: వర్షాలకు తెగిన రోడ్డు.. మానవ వంతెన ద్వారా నీటిని దాటిన స్కూల్ విద్యార్థులు