చండీగఢ్: భారీ వర్షాలకు రోడ్డు తెగిపోయింది. రోడ్డుకు ఒకవైపు స్కూల్ విద్యార్థులు చిక్కుకున్నారు. నడుం లోతులో పారుతున్న వరద నీటిలో ఇద్దరు వ్యక్తులు మానవ వంతెన (Human Bridge)గా ఏర్పడ్డారు. దీంతో స్కూల్ విద్యార్థులు వారి మీదుగా నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. భారీ వర్షాలకు మల్లెయన్, రసూల్పూర్ గ్రామాలను కలిపే రోడ్డు కొట్టుకుపోయింది. ఐదు అడుగుల మేర ఏర్పడిన గ్యాప్‌లో వరద నీరు ఉధృతంగా ప్రవహించింది.
కాగా, స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులను వర్షం కారణంగా ఇంటికి పంపివేశారు. అయితే రెండు గ్రామాల మధ్య ఉన్న రోడ్డు తెగిపోవడంతో సుమారు 35 మంది విద్యార్థులు చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పేరెంట్స్, బంధువులు అక్కడకు చేరుకున్నారు. స్కూల్ పిల్లలకు సహాయం చేసేందుకు కొందరు వ్యక్తులు ముందుకు వచ్చారు. సుఖ్బిందర్ సింగ్, గగన్‌దీప్ సింగ్ కలిసి నడుం లోతున్న వరద నీటిలో మానవ వంతెనగా ఏర్పడ్డారు. దీంతో స్కూల్ విద్యార్థులు వారి మీదుగా ఆ నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లారు.
మరోవైపు రెండు గ్రామాలను కలిపే ఈ రోడ్డు మరమ్మతు కోసం లూథియానా జిల్లా యంత్రాంగం, రసూల్పూర్ గ్రామ పంచాయతీ చర్యలు చేపట్టలేదని మల్లెయన్ పంచాయతీ సభ్యుడు, ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇద్దరు వ్యక్తులు మానవ వంతెనగా ఏర్పడగా స్కూల్ విద్యార్థులు వారి మీదుగా వరద నీటి ప్రవాహాన్ని దాటిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
They turned out to be good Samaritans &made aggrieved school students, teachers cross washed-out road due to excessive rainwater Two bent down in washed-out portion of road in #Punjab village to pose as bridge for students to cross over while 3 others pulled stranded to safety pic.twitter.com/0Rsv5IRhOa
— Neel Kamal (@NeelkamalTOI) July 25, 2025
Also Read:
Watch: తన చెల్లితో కలిసి ఉన్న భర్తను చూసిన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?
BSF Jawan Robs Jewellery Shop | టాయ్ గన్‌తో బెదిరించి.. జ్యువెలరీ షాపులో బీఎస్ఎస్ జవాన్ దోపిడీ