లక్నో: పోలీస్ శిక్షణా కేంద్రంలో సరైన వసతులు లేకపోవడం, బాత్రూమ్ ఏరియాలో కెమెరాలు ఏర్పాటు చేయడంపై ట్రైనీ మహిళా కానిస్టేబుల్స్ (Trainee Woman Constables Protest) ఆందోళన వ్యక్తం చేశారు. శిక్షణా కేంద్రం బయట నిరసన తెలిపారు. బహిరంగ ప్రదేశంలో స్నానం చేయాల్సి వస్తున్నదని ఆరోపించారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్ సివిల్ పోలీస్ 2023 బ్యాచ్‌కు చెందిన 598 మంది ట్రైనీ మహిళా కానిస్టేబుల్స్ గోరఖ్‌పూర్‌లోని 26వ బెటాలియన్ పీఏసీ క్యాంపస్‌కు సోమవారం చేరుకున్నారు.
కాగా, ఆ పోలీస్ శిక్షణా కేంద్రంలో 300 మందికి శిక్షణ ఇచ్చేందుకు సౌకర్యాలున్నాయి. అయితే సుమారు 600 మంది ట్రైనీ మహిళా కానిస్టేబుల్స్‌ను అక్కడకు రప్పించారు. దీంతో తాగునీరు, విద్యుత్, సరిపడా ఫ్యాన్లు, టాయిలెట్లు లేకపోవడంపై ట్రైనీ లేడీ కానిస్టేబుల్స్ ఆందోళన వ్యక్తం చేశారు. బాత్రూమ్ ఏరియాలో సీసీటీవీలు ఏర్పాటు చేయడంపై ఆగ్రహించారు. బహిరంగ ప్రదేశంలో స్నానం చేయాల్సి వస్తున్నదని కొందరు మహిళలు ఆరోపించారు. ఇన్ఛార్జ్ దుష్ప్రవర్తనపై మండిపడ్డారు. అక్కడి రోడ్డును దిగ్బంధించి నిరసన తెలిపారు.
మరోవైపు ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీస్ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు అక్కడకు చేరుకున్నారు. నిరసనకు దిగిన ట్రైనీ మహిళా కానిస్టేబుల్స్‌ను శాంతిపజేశారు. వారిని పీఏసీ ప్రాంగణంలోకి పంపారు. సమస్యలు పరిష్కరిస్తామని పీఏసీ కమాండెంట్ ఆనంద్ కుమార్ హామీ ఇచ్చారు. ‘శిక్షణా కేంద్రం సామర్థ్యాన్ని పెంచేందుకు అదనపు బాత్రూమ్లతో సహా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం’ అని అన్నారు. అయితే ట్రైనీ లేడీ కానిస్టేబుల్స్ నిరసనకు సంబంధించిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
गोरखपुर
⏩ महिला सिपाही ट्रेनिंग सेंटर में हंगामा, 600 ट्रेनी बाहर निकलकर रोती-चिल्लाती आईं सामने
⏩ ट्रेनी महिला सिपाही का गंभीर आरोप- “बाथरूम में लगे हैं कैमरे, हमारे वीडियो बना लिए गए”
⏩ ट्रेनिंग सेंटर की व्यवस्था पर उठे सवाल, कहा – 360 की क्षमता में 600 लड़कियों को ठूंसा… pic.twitter.com/YdbwXrMAsn
— हिन्दी ख़बर | Hindi Khabar 🇮🇳 (@HindiKhabar) July 23, 2025
गोरखपुर में ट्रेनी महिला सिपाही बोलीं- बाथरूम में कैमरे लगे हैं…
महिला रिक्रूटर्स ने बताया कि ट्रेनिंग सेंटर की क्षमता सिर्फ 360 लोगों की है, लेकिन यहां 600 महिलाएं ठूंसी जा रही हैं. इससे रहने, सोने और सुविधाओं में दिक्कत हो रही है. महिलाओं की मांग है कि जब तक समस्याओं का हल… pic.twitter.com/kOVckFqA5G
— News Capsule (@newscapsule_) July 23, 2025
Also Read:
Watch: వర్షం నీటితో నిండిన ఢిల్లీ రోడ్లు, ఈత కొట్టిన వ్యక్తి.. బీజేపీపై ఆప్ విమర్శ
Air India Crash | తప్పుడు మృతదేహాలు చేరాయి.. బ్రిటన్ కుటుంబాలు ఆరోపణ
Fake embassy | నకిలీ రాయబార కార్యాలయం, ఫ్యాన్సీ దౌత్య కార్లు.. ఒక వ్యక్తి అరెస్ట్