Virosh | విజయ్ దేవరకొండ–రష్మిక దంపతులకు సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులు.. ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు
Virosh | ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన స్టార్ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నలకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆయన స్వయంగా విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లి నూతన వధూవరులను కలుసుకుని ఆశీర్వదించారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు.
Virosh | ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన స్టార్ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నలకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆయన స్వయంగా విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లి నూతన వధూవరులను కలుసుకుని ఆశీర్వదించారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. సీఎంతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ తన పోస్టులో, “గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం హృదయాన్ని కదిలించింది. ఆయన ఎల్లప్పుడూ చూపే ప్రేమ, ఆప్యాయతకు మా కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. ఈ పోస్టుతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేశారు.
ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సోషల్ మీడియాలో స్పందించారు. “ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులను ఈ రోజు వారి నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశాను” అని ఆయన ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నల వివాహ రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అయితే ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉండటంతో వేడుకకు హాజరు కాలేకపోయారు. అయితే ఆయన సతీమణి గీతా రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలు కలిసి నటించిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు. ఈ చిత్రాల తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ ఏర్పడినట్లు గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇదిలా ఉండగా పెళ్లికి ముందు విజయ్ దేవరకొండ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన వివాహానికి ఆహ్వానించారు. అనంతరం పెళ్లి తర్వాత రష్మిక కూడా సీఎం నివాసానికి వెళ్లి రిసెప్షన్‌కు ఆహ్వానించినట్లు సమాచారం. ఆ సమయంలో కొత్త పెళ్లికూతురు రష్మికను రేవంత్ రెడ్డి దంపతులు సాదరంగా ఆహ్వానించి తెలుగు సంప్రదాయం ప్రకారం కొత్త బట్టలు ఇచ్చి ఆశీర్వదించారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్లి ఈ కొత్త జంటను రేవంత్ రెడ్డి ఆశీర్వదించడం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.
Heartfully touched that the Hon’ble Chief Minister of Telangana, Shri. @revanth_anumula garu, took the time to visit our home this evening and bless us on our wedding. Grateful for the love and affection he always shares 🙏 pic.twitter.com/QAbp9127ad
— Vijay Deverakonda (@TheDeverakonda) March 5, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
Congress | రైతును కూలీగా మార్చిన కాంగ్రెస్.. యాదాద్రి జిల్లా కొండ్రెడ్డిచెరువులో దుస్థితి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

