Pakistan | పాక్‌లో కొవిడ్ తరహా ఆంక్షలు!.. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు!!
Pakistan | అమెరికా-ఇరాన్ యుద్ధం సెగ పాకిస్థాన్‌ను కూడా తాకింది. హొర్ముజ్ జల సంధిని మూసివేయడంతో పాకిస్థాన్‌కు జరగాల్సిన చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే తీవ్ర నగదు కొరతతో కునారిల్లుతున్న పాకిస్థాన్.. దేశంలో నెలకొనబోయే చమురు కొరతను తలచుకుని ఉలిక్కిపడుతున్నది.
Pakistan | ఇస్లామాబాద్, మార్చి 5: అమెరికా-ఇరాన్ యుద్ధం సెగ పాకిస్థాన్‌ను కూడా తాకింది. హొర్ముజ్ జల సంధిని మూసివేయడంతో పాకిస్థాన్‌కు జరగాల్సిన చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే తీవ్ర నగదు కొరతతో కునారిల్లుతున్న పాకిస్థాన్.. దేశంలో నెలకొనబోయే చమురు కొరతను తలచుకుని ఉలిక్కిపడుతున్నది.
దీంతో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చమురు వినియోగాన్ని ఆదా చేసే ప్రయత్నాలు చేపట్టాలని నిర్ణయించింది. అందులో భాగంగా కొవిడ్ సమయంలో చేపట్టిన పొదుపు, జాగ్రత్త చర్యల్లాంటివే తిరిగి దేశంలో అమలు చేయాలని యోచిస్తున్నది. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ తరగతులతో పాటు రోడ్లపై తక్కువ సంఖ్యలో మాత్రమే వాహనాలు తిరిగేలా చర్యలు చేపట్టనుంది. 47 లక్షల మంది పాక్ పౌరులు గల్ఫ్‌లోని వివిధ దేశాల్లో నివసిస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వారి నుంచి నగదు బదిలీ ఆగిపోతుంది. ఇది ఆర్థికంగా మరింత ఇబ్బంది కానుంది. మార్చిలో అత్యవసరమైన సిబ్బంది మాత్రమే కార్యాలయాలకు రావాలని, మిగిలిన వారు వర్క్‌ఫ్రం హోమ్ చేయాలని ఆదేశాలు జారీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని డాన్ పత్రిక వెల్లడించింది. టెలికం, ఐటీ కంపెనీల సిబ్బంది కూడా వారానికి కనీసం రెండు రోజులు వర్క్ ఫ్రం హోమ్ చేయాలని ఆదేశించనుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

