న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో (Air India Crash) మరణించిన ఇద్దరు ప్రయాణికులకు సంబంధించి తప్పుడు మృతదేహాలు చేరాయని బ్రిటన్కు చెందిన రెండు కుటుంబాలు తెలిపాయి. తమవారి మృతదేహాలను సరిగా గుర్తించలేదని ఆరోపించాయి. బాధిత కుటుంబాల డీఎన్ఏతో ఆ రెండు మృతదేహాల డీఎన్ఏలు మ్యాచ్ కాలేదని బ్రిటన్ కుటుంబాల తరుఫు న్యాయవాది జేమ్స్ హీలీ తెలిపారు. డీఎన్ఏ పరీక్షలు తర్వాత 12 లేదా 13 అవశేషాలు బ్రిటన్కు పంపినట్లు చెప్పారు. అయితే వాటిలో రెండు మృతదేహాలు సంబంధిత కుటుంబాల డీఎన్ఏతో మ్యాచ్ కాలేదని ఆయన వెల్లడించారు. పరిహారం విషయంలో కూడా బ్రిటన్ కుటుంబాలు పలు ఆరోపణలు చేశాయి.
కాగా, ఈ అంశంపై దర్యాప్తు చేస్తున్నట్లు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. అయితే మృతదేహాల తారుమారు గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. జూన్ 12న గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్పై కూలి పేలిపోయింది. విమానంలోని 242 మంది ప్రయాణికులు, సిబ్బందిలో ఒక ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. కొందరు స్థానికులు కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు.
Also Read:
Fake embassy | నకిలీ రాయబార కార్యాలయం, ఫ్యాన్సీ దౌత్య కార్లు.. ఒక వ్యక్తి అరెస్ట్
Watch: సరదాగా కారు నడిపిన పిల్లలు.. తర్వాత ఏం జరిగిందంటే?