చండీగఢ్: ఇద్దరు పిల్లలు సరదాగా కారు డ్రైవ్ చేశారు. (Children Drive SUV) అయితే కారుపై నియంత్రణ కోల్పోయారు. దీంతో వీధుల్లో ప్రమాదకరంగా అది దూసుకెళ్లింది. ఒక బైకర్, కొందరు పిల్లలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పలు బైకులు ధ్వంసమయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హర్యానాలో ఈ సంఘటన జరిగింది. జూలై 16న ఉదయం 8 గంటలకు ఎస్యూవీ కారు అదుపులేకుండా రోడ్డుపై దూసుకెళ్లింది. ఆ కారు తొలుత ప్రమాదకరంగా మలుపు తిరిగింది. బైక్‌పై వెళ్తున్న వ్యక్తి దగ్గర నుంచి దూసుకెళ్లింది. అయితే అతడు తృటిలో తప్పించుకున్నాడు.
కాగా, ఆ వీధిలోని పార్క్ చేసిన బైకులపైకి ఆ కారు దూసుకెళ్లింది. అక్కడున్న పిల్లలు ఇది చూసి భయంతో పరుగులు తీశారు. చివరకు కారు టైర్ల ముందు ఒక బైక్ పడింది. ఒక ఇంటి మెట్ల వద్ద అది అడ్డుపడటంతో చివరకు ఆ కారు ఆగింది. ఆ తర్వాత దాని నుంచి ఇద్దరు బాలురు కిందకు దిగారు. ఆ కారును పిల్లలు డ్రైవ్ చేసినట్లు తెలుసుకుని స్థానికులు షాక్ అయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో వారంతా ఊరట చెందారు. అయితే పలు బైకులు ధ్వంసమయ్యాయి.
మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ పిల్లల పేరెంట్స్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కారు డ్రైవ్ చేసేందుకు బాలుడిని ఎలా అనుమతించారని కొందరు మండిపడ్డారు. ఒకవేళ ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కారు డ్రైవ్ చేసిన బాలుడి పేరెంట్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
हरियाणा में बच्चों ने चलाई वेन्यू कार
तबाही मचा के रख दी pic.twitter.com/JMCFdJ2EVe— The News Basket (@thenewsbasket) July 18, 2025
Also Read:
Pilot Rape Air Hostess | ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ అత్యాచారం.. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు
Watch: భారీ వర్షాలు, వరదలకు రోడ్డుపైకి కొట్టుకొచ్చిన చేపలు.. తర్వాత ఏం జరిగిందంటే?