ముంబై: ఒక మంత్రి అసెంబ్లీలో మొబైల్ ఫోన్లో గడిపారు. రమ్మీ గేమ్ ఆడటంలో బిజీ అయ్యారు. (Minister playing rummy in Assembly) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆయనపై మండిపడ్డాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉన్న మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన వ్యవసాయ మంత్రి మాణిక్‌రావ్ కోకాటే చిక్కుల్లో పడ్డారు. సభలో ఉండగా తన మొబైల్ ఫోన్లో రమ్మీ ఆడారు.
కాగా, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) నేత రోహిత్ పవార్ ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ మంత్రితోపాటు ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ‘అధికారంలో ఉన్న జాతీయవాద వర్గం బీజేపీని సంప్రదించకుండా ఏమీ చేయలేనందున, లెక్కలేనన్ని వ్యవసాయ సమస్యలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో రోజూ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పటికీ, వ్యవసాయ మంత్రికి వేరే పని లేకపోవడంతో రమ్మీ ఆడటానికి సమయం దొరికినట్లు కనిపిస్తోంది’ అని ఎక్స్‌లో విమర్శించారు.
మరోవైపు శరద్ పవార్ కుమార్తె, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే కూడా ఈ సంఘటనపై స్పందించారు. కుటుంబాలను నాశనం చేసే ఆన్లైన్ గేమింగ్‌పై ప్రభుత్వం విరుద్ధ వైఖరిని ఆమె విమర్శించారు. ఆన్లైన్ రమ్మీపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుండగా, అసెంబ్లీ సమావేశంలో ఒక మంత్రి స్వయంగా రమ్మీ ఆడుతున్నారని మండిపడ్డారు. మంత్రి మాణిక్‌రావ్ కోకాటే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహారాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడైన అంబదాస్ దన్వే కూడా మాణిక్రావ్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని అన్నారు.
“#जंगली_रमी_पे_आओ_ना_महाराज…!”
सत्तेतल्या राष्ट्रवादी गटाला भाजपला विचारल्याशिवाय काहीच करता येत नाही म्हणूनच शेतीचे असंख्य प्रश्न प्रलंबित असताना, राज्यात रोज ८ शेतकरी आत्महत्या करत असताना सुद्धा काही कामच नसल्याने कृषिमंत्र्यांवर रमी खेळण्याची वेळ येत असावी.
रस्ता भरकटलेल्या… pic.twitter.com/52jz7eTAtq
— Rohit Pawar (@RRPSpeaks) July 20, 2025
Also Read:
Man Stabs Wife In Hospital | భార్యను కొట్టడంతో ఆసుపత్రిపాలు.. అక్కడికెళ్లి కత్తితో పొడిచి చంపిన భర్త
Watch: వర్షం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?