న్యూఢిల్లీ: వ్యాపారవేత్త అనిల్ అంబానీకి చెందిన రిలియన్స్ పవర్ కంపెనీతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) సోదాలు చేపట్టింది. ముంబై, హైదరాబాద్ నగరాల్లో తనిఖీలను నిర్వహిస్తున్నది. రెండు నగరాల్లో ఉన్న ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇండ్లపై సోదాలు జరుగుతున్న ఈడీ పేర్కొన్నది. సుమారు పది నుంచి 12 లొకేషన్లలో ఆ తనిఖీలు జరుగుతున్నట్లు చెప్పింది. సుమారు 15 మంది సిబ్బంది.. సోదాల్లో పాల్గొన్నట్లు ఈడీ అధికారి ఒకరు వెల్లడించారు. అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలపై .. బ్యాంక్ ప్రాడ్, మనీల్యాండరింగ కేసుల్లో ఈడీ దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. గత నెలలో ముంబైలో ఉన్న అనిల్ అంబానీ ఇంటిని ఈడీ అటాచ్ చేసింది. ఆ నివాసం సుమారు 3500 కోట్ల విలువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.