సీనియర్ వీడియో జర్నలిస్టు దామోదర్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు దామోదర్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కేటీఆర్ తరఫున కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.. దామోదర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులకు చెక్కు అందజేశారు.
హైదరాబాద్‌లోని జీడిమెట్లలో డిసెంబర్ 5వ తేదీన దామోదర్‌కు గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ దామోదర్ కుటుంబానికి అండగా నిలబడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆస్పత్రికి వెళ్లి దామోదర్‌ను పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. కానీ దురదృష్టవశాత్తూ చికిత్సకు స్పందించకపోవడంతో దామోదర్ మరణించారు. ఈ విషయం తెలిసిన కేటీఆర్.. అప్పుడే దామోదర్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
✳️ డిసెంబర్ 5వ తారీఖున జీడిమెట్లలో గుండెపోటుతో మృతి చెందిన సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్
✳️ దామోదర్‌కు గుండెపోటు వచ్చిన రోజే బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆసుపత్రికి వెళ్లిన… pic.twitter.com/ggwWkuHXUu
— BRS Party (@BRSparty) March 6, 2026
ఇచ్చిన హామీ మేరకు దామోదర్ కుటుంబానికి కేటీఆర్ 5లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. దీనికి సంబంధించిన చెక్కును కేటీఆర్ తరఫున దామోదర్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అందజేశారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.