హైదరాబాద్, జూలై 30 (నమస్తేతెలంగాణ): సికింద్రాబాద్ యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న నర్సంపేట మా జీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డిని మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు.
పరామర్శించిన వారిలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచా రం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మె ల్యే ఆరూరి రమేశ్, సతీశ్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.