– ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్
– గుండాల మండలం సుద్దాల విద్యుత్ సబ్ స్టేషన్ పరిశీలన
గుండాల, సెప్టెంబర్ 29 : రాష్ట్రంలో ఎక్కడ 7 గంటలకు మించి వ్యవసాయ మోటర్లకు విద్యుత్ సరఫరా కావడం లేదని ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేతకాని తనం బయటపడుతుందని లాగ్ బుక్ లను మాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గుండాల మండలం సుద్దాల గ్రామంలోని విద్యుత్ సబ్ స్టేషన్ను భిక్షమయ్య గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు రైతులు 24 గంటల కరంట్తో పసిడి పంటలు పండించారన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. నీళ్లు లేవు, కరంట్ ఇవ్వడం లేదు.. పంట పొలాలు అన్ని ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వ్యవసాయానికి 7 గంటలకు మించి కరెంట్ ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం